Ads
భారత దేశము సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మనం పెద్దలను గౌరవం గా చూస్తాము. వారి మాటలను వినడం, ఆచరించడం వంటివి ఇక్కడే ఎక్కువ గా ఉంటాయి. మన పెద్దలకు మనం గౌరవపూర్వకం గా పాదాభివందనం చేస్తూ ఉంటాము.
Video Advertisement

మనం నేలకు వంగి, శిరస్సు వంచి వారి పాదాలను స్పర్శించి వందనం చేస్తాం. ఇలా పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం మనకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. తల్లి తండ్రులకు, మనకు విద్యాభ్యాసం నేర్పిన గురువులకు కూడా మనం ఇలా పాదాభివందనం చేస్తూ ఉంటాము.

అయితే, ఇతర దేశాలలో ఈ సంప్రదాయం లేదు.. వారు కేవలం ఒకరినొకరు పలకరించుకోవడమో, హాగ్ చేసుకోవడమో, షేక్ హాండ్స్ ఇచ్చుకోవడమో చేస్తుంటారు. ఒకవేళ మనలో ఎవరైనా పాదాభివందనం చేసినా.. వారికి దీని గురించి తెలియకపోవడం వలన వింత గా చూస్తూ ఉంటారు.

ఇటీవల, ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఓ భారతీయ విద్యార్థి గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకునే సమయం లో తన ప్రొఫెసర్ కి పాదాభివందనం చేసాడు. అయితే, ఆ ప్రొఫసర్ కి మాత్రం అతను ఏమి చేస్తున్నాడో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ను మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.
watch video:
End of Article
