కుంభకర్ణుడి గురించి తెలియని వారు ఉండరు. ఒకసారి నిద్రపోతే తిరిగి ఎప్పుడు లేస్తాడో తెలియదు. అందుకే అతిగా నిద్రపోయే వారి గురించి చెప్పాలంటే కుంభకర్ణుడిని ఉదాహరిస్తారు. అయితే.. మనలో చాలా మంది గంటల తరబడి నిద్రపోయేవారుంటారు. కానీ.. రోజుల తరబడి నిద్రపోయేవారున్నారని తెలుసా..? ఒకమ్మాయి రోజుల తరబడి నిద్రలోనే ఉంటోందట.

real life sleeping beuty 2

ఒకసారి పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఆమెను లేపడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదట. ఆమె అసలు స్పృహలోనే ఉండదట. ఓసారి ఇలానే పడుకుని పదమూడు రోజుల తరువాత నిద్ర లేచిందిట. తిండి తిప్పలు కూడా లేకుండా ఆమె అలా నిద్రపోతూనే ఉంటుందట. ఆమె తల్లి తండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్తే.. ఆమె ‘హైపర్సోమ్నియా’తో బాధపడుతోంది.. అందుకే అలా నిద్రపోతోందని వివరించారు. అయితే ఎక్కువ రోజులపాటు నిద్రలోనే ఉండడం తో.. ఆమె బలహీనం గా ఉందని వైద్యులు చెప్పారు.

real life sleeping beuty

ఆ బాలిక పేరు ఏచా .. ఆమె వయసు 17 సంవత్సరాలు. నిద్రపోవడం మినహాయిస్తే.. శారీరకం గా ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. హైపర్సోమ్నియా అనే న్యూరోలాజికల్ సమస్య వలెనే ఆమె అతి గా నిద్రపోతుంది. ఆమె తండ్రి మూల్యాది మాట్లాడుతూ.. “ఆమెను నిద్ర లోంచి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించా.. నాకు ఆయాసం వచ్చేది తప్ప ఆమె మాత్రం లేచేది కాదు.. ఆమె ఎప్పుడు మేల్కొని ఉండి మాతో సంతోషం గా ఉంటె చాలు..” అని పేర్కొన్నాడు. అయితే.. వైద్యులు మాత్రం దీనికి ఇంకా చికిత్స లేదని చెబుతున్నారు.