ఇంద్ర సినిమాలో “మీది తెనాలి… మాది తెనాలి..!” బాల నటుడు గుర్తున్నాడా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ఇంద్ర సినిమాలో “మీది తెనాలి… మాది తెనాలి..!” బాల నటుడు గుర్తున్నాడా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

by kavitha

Ads

ఇంద్ర సినిమాలోని మీది తెనాలి మాది తెనాలి డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఈ డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశంలో నటించిన బాలనటుడు గుర్తున్నాడా?

Video Advertisement

బ్రహ్మనందం చేతిలో మోసపోయే ఏవీఎస్ కు కొడుకుగా నటించిన ఈ అబ్బాయి పేరు శివదుర్గ ప్రసాద్. ఈ బాలనటుడు ఫ్యామిలీసర్కస్ సినిమాలో కూడా నటించి, చాలా పాపులర్ అయ్యాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
child-artist-shiva-durga-prasad1శివదుర్గ ప్రసాద్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఫ్యామిలీసర్కస్ సినిమా ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలలో నటించారు. శివదుర్గ ప్రసాద్ రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించాడు. పక్కింట్లో ఉండే జగపతిబాబును బాగా విసిగించే పాత్రలో నటించి ఆడియెన్స్ ని అలరించాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో అతనికి వరుసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అలా ఆ అబ్బాయి ఇంద్ర సినిమాలో నటించాడు.
మీది తెనాలి మాది తెనాలి సన్నివేశంలో ఏవీఎస్, బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి హాస్యనటులతో కలిసి నటించాడు. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ దుర్గ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాల నటుడిగా 1997 లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో ఒక సినిమాలో నటించానని చెప్పారు.
ఇంద్ర, గంగోత్రి, ఔనన్నా కదన్నా లాంటి సినిమాలలో నటించానని, ఫ్యామిలీ సర్కస్ ఎక్కువ గుర్తింపును ఇచ్చిందని అన్నారు. దాదాపు 80 కి పైగా సినిమాలలో, 20 కి పైగా సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నటించినట్టు తెలిపాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో చేశానని అన్నారు. పాపులర్ సీరియల్ అయిన అమృతంలో నరేష్ కొడుకుగా నటించానని తెలిపాడు.

Also Read: “తమన్నా” నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ జీ కర్దా ఎలా ఉంది..? ప్రేక్షకులని అలరించిందా..?


End of Article

You may also like