Ads
సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.
Video Advertisement
ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఒక పాట ట్యూన్ ఇంకొక భాషలోనే మరొక ట్యూన్ మ్యాచ్ అయ్యింది. తమిళ్ లో ప్రభుదేవా హీరోగా నటించిన 2001 లో వచ్చిన అల్లి తంద వానం అనే సినిమాలోని ఒక పాట తెలుగులో ఒట్టేసి చెబుతున్నా సినిమాలో ఒక పాట సిమిలర్ గా ఉంటాయి. తమిళ్ లో ఈ పాటని శంకర్ మహదేవన్, సుజాత పాడగా, తెలుగులో ఉదిత్ నారాయణ్, సుజాత పాడారు.
అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 2002 లో విడుదలైన బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాలో రాధే గోవిందా పాట కూడా ఇదే ట్యూన్ కి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే తమిళ్ సినిమాకి, తెలుగులో విడుదలైన ఒట్టేసి చెబుతున్నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్.
కాబట్టి వాళ్ళ ట్యూన్స్ వాళ్లు వేరే సినిమాలకు ఉపయోగించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఒక విద్యాసాగర్ మాత్రమే కాదు ఇలాగే ఎ.ఆర్.రెహమాన్, హ్యారిస్ జయరాజ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఎంతోమంది సంగీత దర్శకులు తాము కంపోజ్ చేసిన ట్యూన్స్ వారి వేరొక సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగానో, లేదా ఇంకొక పాట లాగానో ఉపయోగించారు.
End of Article