ఈ పదేళ్లలో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఇవే…!

ఈ పదేళ్లలో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఇవే…!

by Mounika Singaluri

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లవుతాయి, కొన్ని సూపర్ హిట్లవుతాయి, కొన్ని హిట్లవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగిలిపోతాయి.

Video Advertisement

అయితే హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా దర్శక నిర్మాతలు సినిమాలు రూపొందిస్తూ ఉంటారు. హీరోలు కూడా తమ అభిమానులను అలరించే విధంగా కొత్త కొత్త సినిమాలతో ముందుకు వస్తూ ఉంటారు.

అయితే ఆ ఏడాది ఎక్కువ కలెక్షన్ సాధించిన దాన్నిబట్టి ఎక్కువ మందికి నచ్చిన దాన్నిబట్టి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా పరిగణిస్తూ ఉంటారు. ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు. మంచి దర్శకుడు మంచి కథతో రావాలి, అది ప్రేక్షకులందరికీ నచ్చాలి దానికి తగ్గ కలెక్షన్స్ కూడా రావాలి. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా కూడా కలెక్షన్స్ రావు. అయితే 1999 నుండి 2016 వరకు ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలో లిస్టును ఒకసారి పరిశీలిస్తే…

1999 వ సంవత్సరంలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమా, 2001లో నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా రికార్డు నెలకొల్పింది. 2003లో రాజమౌళి ఎన్టీఆర్ సింహాద్రి సినిమా, 2004లో మళ్ళీ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి.

2005లో వెంకటేష్ సంక్రాంతి సినిమా, 2006లో మహేష్ బాబు పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. 2007లో యమదొంగ సినిమా 2008లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది. 2009లో బాలయ్య బోయపాటి సింహ సినిమా ఇండస్ట్రీ హిట్ కేటగిరీలోకి వచ్చింది


End of Article

You may also like