కోడలిని కూతురిగా భావించి… ఈ అత్తమామలు చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

కోడలిని కూతురిగా భావించి… ఈ అత్తమామలు చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Anudeep

Ads

కరోనా.. ఇది ఒక మహమ్మారి. 2020 లో వచ్చిన ఈ మహమ్మారి ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. బిడ్డకు తల్లిని, తల్లి బిడ్డని, భార్యకు భర్తని, భర్తకు భార్యని లేకుండా చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో జీవితాలను అయోమయంలో పడేసింది. ఇప్పుడు మనం తెలుసుకునేది అలాంటి కథ. తల్లిదండ్రులకు కన్నబిడ్డని, భార్యకు భర్త ని దూరం చేసింది కరోనా. భర్తను కోల్పోవడంతో ఆమె జీవితం అంధకారంగా మారిపోయింది.

Video Advertisement

కానీ అత్తమామల మాత్రం కోడలు జీవితం అంధకారం కాకూడదని, ఆమె సంతోషంగా ఉండాలని  కొత్త జీవితాన్ని అందించారు. ఈ ఘటనను మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగిగా రిటైర్డ్ అయిన యుగ్ ప్రకాష్ తివారి కొడుకు ప్రియాంక్ తివారి  కోవిడ్ బారినపడి ప్రాణాలు విడిచాడు. కొడుకు మరణంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.  ప్రియాంక్ భార్య రిచా, ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అనాధలై పోయారు.

ప్రియాంక్ తల్లిదండ్రులు కోడలు మరియు మనవరాలు జీవితం అంధకారం కాకూడదని ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేశారు. కోడల జీవితంలో వెలుగులు నింపాలని ఆశతో, ఆమెను ఒక కోడలు గా కాకుండా కూతురు గా భావించి మరో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. మరో పెళ్ళికి రిచాను ఒప్పించి, అక్షయ తృతీయ నాడు నాగపూర్ నివాసి అయిన వరుణ్ మిశ్రాతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఈ వివాహంలో విశేషమేంటంటే అత్తగారే కోడలిని కూతురుగా భావించి కన్యాదానం చేశారు.

అంతేకాకుండా తన కోడలు, మనవరాలు భవిష్యత్లో ఎలాంటి సమస్య ఎదురు కాకూడదని, వాళ్ల జీవితాలు సంతోషంగా సాగాలని  అక్షరాల 60 లక్షల రూపాయల బంగ్లాను కానుకగా ఇచ్చామని వివాహ సందర్భంగా  తెలియజేశారు యుగ్ తివారి. ప్రియాంక్ మరణాంతరం ఆయన ఉద్యోగం రిచాకు వచ్చింది. వివాహం తర్వాత రిచా కుమార్తె అన్య తల్లితో కలిసి నాగపూర్ వెళ్ళిపోయింది. ఈ అత్తమామలు చేసిన మంచి పనికి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ కథ ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు.


End of Article

You may also like