60 ఏళ్ల క్రితమే మొదటి కరోనా వైరస్ కనిపెట్టిన మహిళ…ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

60 ఏళ్ల క్రితమే మొదటి కరోనా వైరస్ కనిపెట్టిన మహిళ…ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

by Anudeep

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని కరోనా వైరస్ పై యుద్దం చేస్తున్నాయి..ఏ దేశానికి ఆ దేశం కరోనా నివారణకు మందుని కనుక్కోవడానికి ఎందరో సైంటిస్టులు కష్టపడుతున్నారు. మందుని కనుక్కోవాలంటే ముందు ఆ వైరస్ కి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి.. కాని అవన్ని కూడా ఎప్పుడో అరవై ఏళ్ల క్రితమే కనిపెట్టారు వైరాలజిస్ట్ జూన్ అల్మిడా .. ఆ వైరస్ కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ప్రపంచానికి అందించారు.

Video Advertisement

1964లోనే లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ లేబరేటరీలో ఆమె ఈ వైరస్‌ను గుర్తించారు..1930లో స్కాట్లాండ్లోని గ్లాస్గో లో జన్మించిన జూన్ అల్మీడా ఆర్దిక పరిస్థితులు సహకరించకపోవడంతో పదిహారవ ఏటనే చదువును ఆపేశారు. తర్వాత గ్లాస్గో లోని రాయల్ ఇన్ఫర్మరీ ల్యాబరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు . తను చేస్తున్న ఉద్యోగం ఉన్న ఇష్టం, కొత్తగా ఇంకా ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో స్కాట్లండ్ నుండి లండన్ కి షిప్ట్ అయ్యారు.

అక్కడ నుండి  పరిచయం అయినా వెనిజులాకు చెందిన ఆర్టిసట్ ఎన్నకెస్‌ను పెళ్లి చేసుకుని, పాప పుట్టిన తరువాత అల్మీడా కుటుంబం కెనడాలోని టొరెంటొకు షిప్ట్ అయ్యారు. అక్కడే ఉన్న ఒంటారియో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయి ఎలక్టాన్ మైక్రోస్కోప్ విభాగంలో మంచి నైపుణ్యం సంపాదించారు. యాంటీబాడీలను ఉపయోగించి వైరస్‌లను మరింత పెద్దవిగా, క్లియర్‌గా చూసే విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు. తను  చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ సంపాదించుకున్నారు.

అల్మిడా ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం ఆమెను తిరిగి తమ దేశానికి రావలసిందిగా కోరింది. దాంతో కెనడా నుండి లండన్ కి షిష్ట్ అయి , లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌‌కు చెందిన మెడికల్ స్కూల్‌లో విధులు నిర్వర్తించారు. ఇక్కడే డాక్టర్ డేవిడ్ టిరెల్‌తో కలిసి సాధారణ జలుబుకు కారకమయ్యే వైరస్‌లను గురించి అధ్యయం చేశారు. ఇందుకోసం వారు వాలంటీర్లను నియమించి వారి నుంచి నమూనాలను సేకరించి ప్రయోగాలు చేసేవారు.

ఇక్కడ ఒక విద్యార్దికి సంభందించిన నమూనాలోని వైరస్ లక్షణాలు డా. టిరెల్, ఆల్మిడాలకు  అంతు చిక్కలేదు. ఆ వైరస్ మానవుల శరీర అవయవాల్లో పెరుగుతుంది, తప్ప సెల్ కల్చర్లో పెరగకపోవడాన్ని..ఆ వైరస్ వలన జలుబు వస్తుంది అనే విషయాన్ని కనుక్కున్నారు. ఇన్ఫ్లుయెంజా తరహాలో ఉన్నప్పటికి ఈ వైరస్ ప్రత్యేకమైనదని ,దీనికి కారణం దాని చుట్టూ ఒక వృత్తాకారపు (HALO) రూపంలో ఆవరించి ఉండడంతో వాటికి కరోనా అని నామకరణం పెట్టారు. లాటిన్ భాషలో హాలో అనగా కరోనా.. ఇది మనుషులకి సోకే మొట్టమొదటి కరోనావైరస్ .

రిటైర్మెంట్ కి ముందు ఆమె లండన్ లోని వెల్కమ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసి, అక్కడే రిటైర్ అయ్యారు.ఆ తర్వాత యోగా ట్రెయినర్ గా మారి, మళ్లీ చివరకి వైరాలజి విభాగంలోనే సలహాదారుగా మారారు, HIV వైరస్ ఫోటోలు తీయడంలో కూడా ఆమె సహాయం ఉంది. జూన్ అల్మీడా 77 ఏళ్ల వయసులో 2007లో గుండె పోటుతో చనిపోయారు. ఇప్పుడు కరోనా వైరస్ ని అర్దం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు, అప్పట్లో ఆమె చేసిన పరిశోధనలే ఉపయోగపడుతున్నాయి.


You may also like

Leave a Comment