సీతక్కతో ఉన్న “తస్లిమా” గురించి ఈ విషయాలు తెలుస్తే అసలైన అమ్మ అంటారు!

సీతక్కతో ఉన్న “తస్లిమా” గురించి ఈ విషయాలు తెలుస్తే అసలైన అమ్మ అంటారు!

by Anudeep

Ads

కరోనా వ్యాప్తి నేపధ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు  అవగాహన కల్పిస్తూ,నిత్యావసర సరుకులు పంపిణి చేస్తూ నిస్వార్దంగా సేవ చేస్తున్న ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారా అంటే సీతక్క మాత్రమే..ఇటీవల సీతక్కకి సంభందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.. సీతక్కతో పాటుగా మరో వ్యక్తి మూటలు మోస్తూ అడవుల్లో సీతక్కతో పాటు పర్యటిస్తున్న ఆ వ్యక్తి ఎవరా అని అందరకి అనేక ప్రశ్నలు తలెత్తాయి..తను తస్లీమా మహ్మద్ , ములుగు సబ్ రిజిస్ట్రార్.

Video Advertisement

సీతక్క మాదిరిగానే ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వ అధికారిణి తస్లీమా మహ్మద్.. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఎవరైనా అమ్మా సాయం అంటూ అడిగేది ఆలస్యం తానున్నాంటూ ముందుకొస్తారు తస్లీమా మహ్మద్..తన గురించి తెలుసుకుంటున్నా కొద్ది ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.. ఆకలి విలువ, అన్నం విలువ,జీవితం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే ప్రజలకు ఒక అమ్మలా నిలబడింది అని అనిపిస్తుంటుంది.

తస్లీమా తండ్రి సర్వర్ కమ్యునిస్టు పార్టీ నాయకుడు, తస్లీమా రెండేళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు. చిన్నవయసులో తండ్రి మరణం, తల్లి పైనే కుటుంబ భారం పడడంతో తస్లీమా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది.చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా..చదివించే స్తోమత తల్లికి లేకపోవడంతో చిన్నతనంలోనే ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ అయి, చదువే ధ్యేయంగా, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా బతికింది..డిగ్రీకి వచ్చేటప్పటికి కాకతీయ యూనివర్శిటి లైబ్రరీలోనే ఎక్కువ సమయం గడిపేది..ఒక రకంగా తన విజయానికి అక్కడి పుస్తకాలే కారణం అని చెప్తుంది తస్లీమా.

తండ్రి లేని పిల్లలంటే అమితమైన ప్రేమ . అలాంటి వారెందరికో పెద్ద దిక్కుగా మారింది తస్లీమా..కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత ఆగమ్యగోచరంగా ఉంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టే వారందరికి పెద్ద దిక్కుగా మారింది..ఏ సమస్య వచ్చినా ఈ అక్క ఉంది అంటూ వారిలో ధైర్యం నింపుతుంది..పిల్లల్ని స్కూల్ కి పంపమని, చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని పదే పదే పిల్లలకి, తల్లిదండ్రులకు నూరిపోస్తుంది.

ప్రభుత్వోద్యోగిగా బాద్యతల నిర్వహణ, వారాంతంలో వ్యవసాయం..ఇది తస్లీమా జీవనశైలి. తండ్రి పేరిట ఏర్పాటు చేసిన సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు..ఇలా క్షణం తీరికలేకుండా ప్రజలకోసం పనిచేస్తూనే ఉంటుంది.. తస్లీమాకి సంభందించి మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అభిమానసంఘాలు.. ఒక ప్రభుత్వాధికారిణికి అభిమానసంఘాలు ఏంట్రా అని ఆశ్చర్యపోకండి..తనకి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు కానీ తన అభిమాన సంఘాల పేరిట ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లు..వాటిల్లో తన గురించి మరిన్ని ఆసక్తికరవిషయాలు వాటిల్లో ఉన్నాయి.

 

 

 


End of Article

You may also like