తల్లి దగ్గర తీసుకున్న 30000 తో మొదలుపెట్టి…50 లక్షలు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువతి!

తల్లి దగ్గర తీసుకున్న 30000 తో మొదలుపెట్టి…50 లక్షలు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువతి!

by Mohana Priya

Ads

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేసిన వస్త్రం ఖాదీ. ఇప్పుడు పాలిస్టర్ పట్టు లాంటి ఆధునిక వస్త్రాల రాకతో ఖాదీ అంతగా ఆదరణ పొందటం లేదు. కానీ ఈ పురాతన ఖాదీయే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ వాడుకలోకి వస్తోంది. భారతదేశం మరియు విదేశాలలో చాలా మంది డిజైనర్లు అంతరిస్తున్న కళను కాపాడటానికి మరియు స్థానిక చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ఖాదీని తిరిగి ఆవిష్కరిస్తున్నారు.

Video Advertisement

అటువంటి సంస్థే ఉమంగ్  శ్రీధర్ స్థాపించిన భూపాల్ కి చెందిన ఖాదిగి.మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ స్థానిక హ్యాండ్ స్పిన్నర్లకు మరియు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్  లోని చేనేత కార్మికులకు ఖాదీ తయారీకి శిక్షణ ఇస్తోంది.ఈ సంస్థ లోని 60 శాతం ఆదాయం చేతి వృత్తి కార్మికులకు చేరుతుంది. వెదురు ఇంకా సోయాబీన్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల లాంటి సహజ పదార్థాలు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలిగించకుండా ఖాదీగి నడుస్తోంది.

ఖాదీగి గురించి ఉమంగ్ బెటర్ ఇండియా తో మాట్లాడుతూ “నేను బుందేల్‌ఖండ్ గ్రామీణ ప్రాంతంలో పెరిగాను, అక్కడ చేతివృత్తులవారు బాధపడటం నేను చూశాను, ఎందుకంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా ఇలాంటి దేశీయ కలలు మాత్రం వృద్ధిలోకి రావు. కాబట్టి, వాటిని అందరికీ పరిచయం చేయడం మా ప్రాథమిక లక్ష్యం. అంతేకాకుండా, ఖాదీ తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పత్తి. మన భారతీయ వస్త్రాలను తిరిగి వెలుగులోకి తీసుకురావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ఎంతో మందికి తెలీదు” అన్నారు.

ఈ స్టార్టప్ యొక్క మరో ముఖ్యమైన ఉద్దేశం మహిళలకు వృత్తి కల్పించడం.ఉమంగ్ యొక్క గురువు, పెట్టుబడిదారులు, స్పిన్నర్లు మరియు చేనేత కార్మికుల నుండి, చాలా మంది వాటాదారులు అందరూ మహిళలే . ఉమంగ్ తల్లి  ఈ సంస్థ యొక్క మొదటి పెట్టుబడిదారులు.“ఖాదీ ప్రపంచంలో, కాటన్ స్పిన్నర్లను కాటిన్ అని పిలుస్తారు, ఇది స్త్రీలను సూచిస్తుంది. సాంకేతికంగా, మగ స్పిన్నర్లకు పదం లేదు. కాబట్టి, ఇది స్త్రీల కోసమే ఉద్దేశించబడిన కళ ” అని ఉమంగ్ అన్నారు.ఈ సంస్థ ద్వారా ఆమె ప్రభుత్వ యాజమాన్యంలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) లో భాగమైన 300 మంది మహిళా కళాకారుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.

మేము కెవిఐసి కార్యక్రమంలో భాగమైన మహిళలను తీసుకుంటాము. స్పిన్నర్లు మరియు నేత కార్మికులు నెలకు 6,000 మరియు 9,000 రూపాయలు సంపాదిస్తారు. అనుభవం ఉన్నవారు 25,000 నుండి 30,000 రూపాయల మధ్య ఏదైనా సంపాదిస్తారు, ”అని ఉమంగ్ అన్నారు.ఖాతాదారుల విషయానికి వస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి పెద్ద కార్పొరేట్‌లతో సహా ఆమెకు ప్రముఖమైనవి ఉన్నాయి. ఈ సంస్థ డిజైనర్లు, వ్యాపారులు, మరియు కార్పొరేట్ పరిశ్రమలకు బట్టలు మరియు గిఫ్టు లను సరఫరా చేస్తుంది.

ప్రారంభమైనప్పటి నుండి, ఖాదిగి  50,000 మీటర్ల ఫాబ్రిక్ ని  ఉత్పత్తి చేసి విక్రయించింది. గతేడాది రూ .50 లక్షల ఆదాయాన్ని నమోదు చేసింది.బుందేల్‌ఖండ్‌లోని దామో ప్రాంతంలో కిషన్గంజ్ అనే చిన్న గ్రామంలో జన్మించింది ఉమాంగ్. తనకి ఎటువంటి అసౌకర్యాలు లేవు. అయినా తను తన చుట్టుపక్కల ఉన్న సమస్యలను, కులవివక్షను గమనించేది.“దురదృష్టవశాత్తు, నేను కూడా ఈ సమాజంలో ఒక భాగమే. ప్రజలను వారి పేరు ద్వారా కాదు, వారి కులం ద్వారా పిలుస్తారు. ఇంకా, నేను ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య కనిపించే వ్యత్యాసాన్ని చూసి నేను షాక్ అయ్యాను, ”అని ఆమె గుర్తుచేసుకుంది.

తన తల్లిదండ్రులు కూడా అవసరమైన వారికి సహాయం చేసే వాళ్ళు. వాళ్ళని చూసి ఉమంగ్ కూడా అలాగే ఏదైనా అవసరం ఉన్నవారికి తనకు చేతనైనంత సహాయం చెయ్యాలి అనుకుంది.ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం తో పాటు, పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసం ఉమంగ్ కొన్ని ఎన్జీవోలతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసింది. అప్పుడే తను ఖాదీని పైకి తీసుకురావడానికి మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు తీసుకుంటే, అటు ఖాదీ వెలుగులోకి రావడంతో పాటు, మహిళలకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది అని నిర్ణయించుకుంది.

ఖాది గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి 2014లో ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది.ఆమె స్కూల్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా నుండి ఫెలోషిప్ కూడా చేసింది.  వస్త్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన పోటీలో చేనేత వస్త్రాలను ఉపయోగించి ఇంటి కావలసిన వస్త్రాలను రూపొందించడంలో ఉమాంగ్‌కు మొదటి బహుమతి లభించింది. ఉమాంగ్ తరువాతి రెండేళ్ళు పరిశోధనలో గడిపి. 2017 లో రూ .30,000 పెట్టుబడితో ఖాదీగిని ప్రారంభించింది. కొద్ది సంవత్సరాల తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ ఇంకా భూపాల్ నుండి ఎంతో మంది పెట్టుబడిదారులు ఈ సంస్థ లో కలిశారు.

ఖాదీ మరియు డిజిటల్ అనే రెండు పదాలను ఉపయోగించి ఉమాంగ్ తన స్టార్టప్ ఖాదీగి అని పేరు పెట్టారు. చేతివృత్తులవారు సాంప్రదాయక వస్త్రాన్ని తయారుచేయడానికి, ‘చార్ఖా’ అని పిలువబడే స్పిన్నింగ్ వీల్‌ను ఉపయోగిస్తారు.“మేము ఖాదీ ఫాబ్రిక్‌పై డిజిటల్ ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగిస్తాము. దాని కోసం, మేము మహిళలకు అవసరమైన పరికరాలు, నూలులు మరియు డిజైన్లను అందిస్తాము. మేము సంవత్సరంలో పది నెలలు కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళని నియమించుకుంటాము, వారికి తగిన జీతం కూడా ఇస్తాము”అని ఉమాంగ్ చెప్పింది.

ఈ సంస్థ పెట్టడం మాకు అంత సులువు కాలేదు. నేను నా మెంటర్ సారిక కలిసి మార్కెట్ గురించి లోతుగా డీకోడింగ్ చేసాము. సంస్థ మొదలు పెట్టిన వెంటనే విజయం సాధించలేదు. ముంబైలోని ఒక బోటిక్ తో కలిసాము. వారి బోటిక్ లో మా దుస్తులు పెట్టడంతో మెల్లగా అందరికీ తెలిసి జైపూర్ నుండి ఢిల్లీ ముంబై లాంటి అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఖాదీని మా సంస్థ నుండి తీసుకోవడం మొదలు పెట్టారు.

లాక్‌డౌన్‌ తర్వాత ఉమంగ్ తానియా కలిసి బట్టలపై క్యూఆర్ కోడ్ ని ముద్రించాలి అని నిర్ణయించుకున్నారు. దీనివల్ల బట్ట ఎంత పొడవు ఉంది అనేది కొలవకుండా స్కానింగ్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.ఇలా ఉమంగ్ ఎంతో మందికి ఉపాధి కల్పించాలి అని కలలు కనడమే కాకుండా, ఎన్నో విధాలుగా కష్టపడి తన కలలను సాకారం చేసి, తనతో పాటు ఎంతో మంది మహిళలను ముందుకు నడిపించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

source : thebetterindia

 


End of Article

You may also like