Ads
పిల్లలపై ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అని అడిగితే తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా అని చెబుతారు. పిల్లలను ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడుకుంటారు. తొమ్మిది మాసాలు మోసి పెంచిన పిల్లలని, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు అలా కాదు. నిర్ధాక్షిణ్యంగా ఆ పసి బిడ్డని రోడ్డుపై వొదిలేసి అనాథను చేశారు.
Video Advertisement
ఎంతో స్వఛ్చమైన బాల్యపు గుండెల్లో విషాదాన్ని నింపారు. అసలు ఎందుకు వొదిలేసారో తెలీదు. బరువు అనుకున్నారో? ఆడపిల్ల అనుకున్నారో? ఇంకేదైనా కారణం చేత పిల్లని వొద్దు అనుకున్నారో తెలీదు. అక్కడ వొదిలేయగా ఒక అనాథ శరణాలయం వారు ఆ బిడ్డను తీసుకుని పెంచారు. కానీ కొన్నేళ్ల తర్వాత కన్న తల్లిదండ్రులు ఒక వజ్రాన్ని కోల్పోయామే అని బాధపడే స్థాయికి చేరుకుంది ఆ అమ్మాయి.
తను ఎవరో కాదు “లీసా స్థలేస్కర్” ఆస్ట్రేలియన్ వుమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. తను పసికందుగా ఉన్నప్పుడే, ఒక అనాథాశ్రమం ముందు కన్న తల్లిదండ్రులు వొదిలి వెళ్లిపోవడంతో… అనాథ శరణాలయం వారు ఆ బిడ్డని పెంచుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో ఉన్న శ్రీ వాస్తవ అనాథాశ్రమం దగ్గర జరిగింది. ఇదిలా ఉండగా ఒకరోజు అమెరికాకు చెందిన హరెన్, స్యూ దంపతులు ఇండియాని సందర్శించేందుకు వచ్చారు.
అలా వచ్చినప్పుడు తాము ఒక అబ్బాయిని దత్తత తీసుకోవాలి అనుకున్నారు. కానీ తమ చూపు… ఎంతో కోమలమైన, మృధువైన, ఆకట్టుకునే కళ్ళతో, అమాయకంగా ఉన్న అమ్మాయి వైపు పడింది. తద్వారా తమ అభిప్రాయాన్ని మార్చుకుని, అబ్బాయికి బదులు ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలి అనుకున్నారు. ఆ అమ్మాయే లీసా. మొదట తన పేరు లైలా అని ఉండగా… ఈ అమెరికా దంపతులు లీసా స్థలేస్కర్ గా మార్చారు. అక్కడి నుండి లీసా జీవితం కీలక మలుపు తీసుకుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకపోయింది.
హరెన్, స్యూ దంపతులు, చట్టపరంగా లీసాను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకువెళ్ళారు. అప్పటికీ వారికి ఒక కుమార్తె ఉన్నప్పటికీ, అమాయకురాలైన లీసా తమకి నచ్చింది. తరువాత అమెరికా నుండి తమ కుటుంబం ఆస్ట్రేలియాకు చేరుకోగా…లీసా తన చదువును పూర్తి చేసుకుంటూనే క్రికెట్ వైపు మొగ్గు చూపింది. అప్పుడప్పుడు వీధిలో పిల్లలతో సరదాగా ఆడుతుండగా…అదే తన ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ గా మలచుకుంది.
ఇక అక్కడి నుండి భరిలో దిగింది.లీసా తన మొదటి మ్యాచ్ ను 1997లో న్యూ- సౌత్ వేల్స్ ద్వారా ఆడింది. తరువాత 2002లో ఆస్ట్రేలియా వన్ డే క్రికెట్ మ్యాచ్ ఆడగా… 2003, 2005 లో ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్, మొదటి టీ 20 మ్యాచ్ లను వరుసగా ఆడింది. అనేక పరుగులు తీస్తూ, వికెట్ల పడగొడుతూ… ఇతర టీమ్ లకు ధీటుగా నిలుస్తూ సూపర్ వుమెన్ క్రికెటర్ అనిపించుకుంది. ఒక్కరోజులోనే 100 కాదు 200 కాదు ఏకంగా 1000 పరుగులు తియ్యాడంతో పాటు, 100 వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించింది. తన టాలెంట్ అక్కడితో ఆగలేదు, ICC ర్యాంకింగ్ ప్రకారం నంబర్ వన్ ఆల్ రౌండర్ గా నిలించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే తను సాధించిన విజయాలు ఒకటి రెండు సంఖ్యలతో ముగుసిపోవు. 2013 లో క్రికెట్ ప్రపంచ కప్ ను కూడా సాధించింది. కన్న తల్లిదండ్రులు తనను అనాథను చేసి తలరాతను మారిస్తే… ఇప్పుడు తన తలరాతను తానే రాసుకుని జీవితాన్ని విజయ పథం వైపు నడిపిస్తుంది. దీంతో ఎంతో మంది యువతులకు, అనాథలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది లీసా స్తలేస్కర్.
End of Article