Ads
జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొంత మందికి అంత కష్టపడకుండానే అన్ని దొరుకుతాయి. కానీ కొంత మంది మాత్రం చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వాళ్లకి ఏది అంత ఈజీగా రాదు. కనీస అవసరాలకు కూడా చాలా మంది కష్టాలు పడుతున్నారు. చదువు. ఇది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం. కానీ చదువుకోడానికి కూడా ఇప్పటి కాలంలో కూడా ఇంకా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని వాళ్ళు తమకి కష్టాలు ఉన్నంత మాత్రాన చదువుని నిర్లక్ష్యం చేయట్లేదు. ఒకపక్క పనులు చేస్తూనే, మరొక పక్క చదువుకుంటున్నారు.
Video Advertisement
ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే జీవితంలో సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తులు మన మధ్యలో కూడా ఎంత మంది ఉన్నారు అనే విషయం అర్థం అవుతుంది. నిజంగా ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా, చిప్పగిరి మండలం, బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 509 మార్కులు సాధించింది. నవీన తల్లిదండ్రులు బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల. నవీన తండ్రి ఒక వ్యవసాయ కూలీ. నవీన తల్లికి కిడ్నీ వ్యాధి ఉంది. ఒక్కరోజు పని చేస్తే తప్ప ఆరోజు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండడంతో, నవీన కూడా కుటుంబ బాధ్యతని తీసుకుంది.
చిన్న వయసులోనే తన కుటుంబ బాధ్యతని తన భుజాలపై మోస్తూ, చదువుకుంది. మూడు రోజులు కూలీకి వెళ్ళేది. మరొక మూడు రోజులు స్కూల్ కి వెళ్లి చదువుకునేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో నవీన చదివేది. నవీన ప్రతిభని పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించారు. నవీన చదువుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అందించారు. దాంతో నవీన కష్టపడి చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించింది. ఏదైనా ఒక పని చేయాలి అనే సంకల్పం ఉన్న మనిషి ఏ పని అయినా చేయగలడు అనే మాటకి నిదర్శనంగా నిలిచింది. మనిషి తన కలని సాకారం చేసుకోవడానికి కుటుంబ నేపథ్యం, అవన్నీ కూడా అవసరం లేదు కేవలం ప్రతిభ, నమ్మకం ఉంటే చాలు అనే విషయాన్ని నిరూపించింది.
ALSO READ : SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?
End of Article