ఈ అమ్మాయి గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..! బాల్య వివాహాన్ని ఎదిరించి మరీ..?

ఈ అమ్మాయి గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..! బాల్య వివాహాన్ని ఎదిరించి మరీ..?

by Harika

Ads

బాల్య వివాహాలు. గతంలో ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. గతంలో అంటే ఇప్పుడు కాదు. ఒక 50 సంవత్సరాల క్రితం. మెల్లగా సమయంతో పాటు మనుషులు కూడా మారుతూ రావడంతో, ఈ బాల్య వివాహాలు అనేవి తగ్గాయి. ఇప్పుడు పూర్తిగా మాయం అయిపోయాయి. ఇలా అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతున్న ప్రదేశాలు ఉన్నాయి. బాల్య వివాహాలు వద్దు అని పోరాడుతున్న ఆడపిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ బాల్య వివాహాలు అనేవి ఎక్కువగా ఆడవారి మీద జరుగుతాయి కాబట్టి పోరాటం కూడా ఎక్కువగా వారు మాత్రమే చేస్తారు.

Video Advertisement

sushila bishnoi child marriage

చదువుకోవాలి, జీవితంలో పై స్థాయికి ఎదగాలి అనుకున్న ఎంతో మంది ఆడపిల్లలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలా ఇటీవల ఒక అమ్మాయి కూడా బాల్య వివాహాన్ని, ఎదిరించి తాను అనుకున్నది సాధించింది. కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే ఒక అమ్మాయి కర్నూలు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలో చదువుతోంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించింది. అక్కడ టాపర్ గా నిలిచింది. నిర్మల కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలోని పెద్దహరివరం అనే గ్రామానికి చెందిన వ్యక్తి. పదవ తరగతిలో 537 మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఇంటర్ చదవాలి అనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులకి అంత స్తోమత లేదు.

inspiring story of nirmala

అప్పటికే నిర్మల ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడపిల్లలకి తన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో నిర్మలకు కూడా పెళ్లి చేయాలి అని అనుకున్నారు. దాంతో నిర్మల ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని కలిసి ఈ విషయాన్ని చెప్పింది. దాంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, కలెక్టర్ తో మాట్లాడి, నిర్మల పెళ్లిని ఆపించి, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఆమెని చేర్పించారు. ఇప్పుడు ఇంటర్ లో మంచి మార్కులు సంపాదించుకొని ఊరి పేరుని నిలబెట్టింది.

inspiring story of nirmala

దాంతో నిర్మల మీడియాతో కూడా మాట్లాడింది. తనకి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఆశయం ఉంది అని, బాల్య వివాహాలని అడ్డుకొని, తన లాంటి వారికి సహాయం చేయాలి అని ఉంది అని చెప్పింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ, నిర్మల విజయం సాధించడం అనే విషయం, మహిళా సాధికారత మీద ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనం అని చెప్పారు. నిర్మల కల నిజం చేయడానికి భవిష్యత్తులో వారి సహాయం నిర్మలకి ఎల్లప్పుడూ ఉంటుంది అని భరోసా కూడా ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంతో మంది నిర్మలకి అభినందనలు తెలుపుతున్నారు.

ALSO READ : సుమ డాన్స్ వీడియోస్ లో ఈయన బాగా హైలైట్ అవుతారు..! ఈ వ్యక్తి ఎవరంటే..?


End of Article

You may also like