ఎందరికో ఆదర్శం ఆ జంట…ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తిల లవ్ స్టోరీ మీకు తెలుసా?

ఎందరికో ఆదర్శం ఆ జంట…ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తిల లవ్ స్టోరీ మీకు తెలుసా?

by Mohana Priya

Ads

భారతదేశం గర్వించదగ్గ మహిళల జాబితా ఉంటే ఖచ్చితంగా ఉండే పేరు సుధా మూర్తి. ఆడదంటే ఇంటికే పరిమితం అవ్వాలి అన్న రోజుల్లో, తనకంటూ ఒక సొంత గుర్తింపుని ఏర్పరచుకొని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు సుధామూర్తి. తర్వాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణమూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఇన్ఫోసిస్ అభివృద్ధి చేయడంలో సుధా మూర్తి కూడా ఎంతో సహాయ పడ్డారు. సుధా మూర్తి నారాయణ మూర్తి లది ప్రేమ వివాహం. వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి.

Video Advertisement

పూణేలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సుధా మూర్తి నారాయణ మూర్తి కలుసుకున్నారు. మొదట మంచి స్నేహితులు అయిన వీళ్లు తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. సుధా మూర్తి ని పెళ్లి చేసుకునేందుకు నారాయణ మూర్తి సుధా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అంతా విన్న సుధా వాళ్ళ నాన్న నారాయణ మూర్తి ని ఒక ప్రశ్న అడిగారు “జీవితంలో నువ్వు ఏమి అవ్వాలి అనుకుంటున్నావు?” అని. ఆ ప్రశ్నకు నారాయణమూర్తి ” కమ్యూనిస్టు పార్టీలో చేరి రాజకీయాల్లో రాణిస్తాను. తర్వాత అనాధాశ్రమం నడుపుతాను” అని చెప్పారు. ఆ సమాధానం సుధా వాళ్ళ నాన్నకి అస్సలు నచ్చక పెళ్లి కి ఒప్పుకోలేదు.

కానీ వాళ్ళిద్దరు పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూడేళ్ల తర్వాత 1970లో నారాయణమూర్తికి జాబ్ లభించింది. 1977లో ముంబైలోని ప‌ట్ని కంప్యూట‌ర్స్‌లో జీఎంగా ఉద్యోగం రావడంతో, సుధా మూర్తి వాళ్ళ నాన్న వాళ్ల పెళ్లికి అంగీకరించారు. ఫిబ్రవరి 10 1978లో వారి వివాహం జరిగింది. వివాహం ఖర్చు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే.

సుధా మూర్తి నారాయణ మూర్తి లకు ఇద్దరు పిల్లలు. 1981లో నారాయణమూర్తికి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. సుధామూర్తి తను దాచి పెట్టుకున్న పదివేల రూపాయల నారాయణమూర్తికి ఇచ్చారు. ఇంకొంత మందితో కలిసి నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించారు. ఎంతో కష్టపడి ఇన్ఫోసిస్ ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు.

ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళు అప్పుడే లా ఉండే వాళ్ళు ఇప్పటికీ అలానే ఉన్నారు. సుధా మూర్తి కి ఇన్ఫోసిస్ లో పార్ట్నర్ షిప్ కూడా ఉంది. అలా వీళ్ళిద్దరూ ఆదర్శ మనుషులు గానే కాకుండా ఆదర్శ దంపతులుగా కూడా నిలిచారు. కెరియర్ పరంగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా ఎంతో ఒదిగి ఉంటూ నేడు ఎందరో ఎంటర్ప్రెన్యూర్ లకు ఆదర్శంగా నిలిచారు.


End of Article

You may also like