• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports
  • Mythology
  • Health Adda
  • Viral

లెక్కల టీచర్ కావాలనుకుంది…! కానీ తన కృషి, పట్టుదలతో యూకే లో తెలుగువారి సత్తా చాటిన విజయవాడ మహిళ…!

Published on July 14, 2022 by Lakshmi Bharathi

ఆడవారికి చదువు, ఉద్యోగం అంటే చిన్నచూపు చూసే సమాజం మనది. తమకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకోవాలనే ఆలోచన ఉన్న, వాటిని అణచివేస్తూ, కుటుంబ బాధ్యతలలోకి నెట్టేస్తూ ఉంటారు మహిళలను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాంటి అసాధ్యమైన పని అయిన గెలిచి చూపించవచ్చు అంటున్నారు ఆమె. ఈమె కథ ఎందరికో ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.

ఆమె పేరు భాగ్యారెడ్డి. మహిళల ఎదుగుదలకు పెళ్లి, పిల్లలు అవరోధం కాదని నిరూపించింది. స్వస్థలం విజయవాడ దగ్గరలోని కృష్ణలంక. మహిళకు చదువుకు మించిన వరం మరొకటి లేదంటూ, దానికి నినే నిదర్శనం అంటూ చెప్పుకొస్తోంది భాగ్యారెడ్డి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అమ్మాయిలకు చదువు కన్న పెళ్లి ముఖ్యం అని అభిప్రాయపడే కుటుంబం నుంచి వచ్చాను. బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే  మంచి సంబంధం వచ్చిందని నాకు పెళ్లి చేశారు. భర్త ప్రోత్సాహంతో ఎమ్మెసీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను.

చదువు పూర్తి చేస్తున్న సమయంలోనే బాబు పుట్టాడు.  ఎమ్మెసీ చదివే టైం లో ఒక లెక్కలు బోధించే మాస్టార్ కావాలి అనుకున్నాను. కానీ దేశమంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే నేను మాత్రం లెక్కలు టీచర్ గా ఎందుకు ఉండాలని నాలో నాకే ప్రశ్న మొదలయ్యింది. నా బాబు బాధ్యతను మా అమ్మకి  అప్పగించి హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశాను. కోర్సు పూర్తి చేసిన తరువాత ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాను. బెంగుళూరులో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ ఆబ్జెక్ట్ ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం సంపాదించాను. అక్కడితో మొదలైన నా ప్రయత్నం నా పని తీరు నచ్చడంతో  ఏడాదికే స్విట్జర్లాండ్ కు చేరుకుంది. కుటుంబం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. భర్తను, బాబు ని వదిలి అంతదూరం వెళ్లి ఉద్యోగం చేయడం అవసరమా అంటూ విమర్శలు ఎదురయ్యాయి. అవి ఏవి పట్టించుకోకుండా కెరియర్ పై దృష్టి పెట్టాను.

లండన్ లో ఒంటరిగానే ఉంటూ మరో పెద్ద కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్ గా అవకాశం పొందాను. ఇక్కడ నుంచి వెనుతిరిగి చూడకుండా బ్రిటిష్ టెలికమ్యూనికేషన్ సంస్థలో డైరెక్టర్ గా నియామకం అయ్యాను. 450 మంది ఉద్యోగులను లీడ్ చేసే స్థానానికి చేరుకున్నాను. ఆ సంస్థలో పదిమంది డైరెక్టర్లలో ఏకైక భారతీయరాలుని నేను మాత్రమే అని గర్వంగా చెప్పుకున్నారు భాగ్యారెడ్డి.

అంతేకాకుండా చాలా మంది మహిళలు పెళ్లి, పిల్లలు కారణంగా ఉద్యోగ జీవితానికి స్వస్తి చెప్పేస్తుంటారు. అలాంటి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా రిటర్న్ టు వర్క్ గ్రూప్ ని ప్రారంభించారు భాగ్యారెడ్డి . ఈ గ్రూపు ద్వారా మహిళలకు కెరియర్ కౌన్సిలింగ్  అందించడంతోపాటు వృత్తి మరియు కుటుంబ జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం వంటి అంశాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిల చదువుకు తన వంతు సహాయం చేస్తూ ఎంతోమందికి అండగా నిలిచారు. ఈమె సేవలకు గుర్తించి యూకే ప్రభుత్వం ఉమన్ ఇన్ డేటా అవార్డుని ప్రదానం చేసింది. ఈ అరుదైన పురస్కారం కోసం ఎంపికైన 20 మంది మహిళలలో నేనొక్కదాన్నే కావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు భాగ్యారెడ్డి. ఈమె కథ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవాలి అంటూ కోరుకుందాం.

Watch this video :



Recent Posts

  • “విరాట్ కోహ్లీ ఏం రిటైర్మెంట్ ప్లాన్ చేయట్లేదుగా.?” అంటూ… కోహ్లీ కామెంట్స్‌పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!
  • ఈమె నటిస్తుంటే పిచ్చిదని అనుకుని పట్టుకున్నారట..కానీ ఆఖరికి..?
  • శ్రీహరి ఉన్నప్పుడు అందరికీ సహాయం చేసేవారు.. కానీ మేము ఇప్పుడు ఈ పరిస్థిలో ఉన్నామంటూ ఎమోషనల్ అయిన డిస్కో శాంతి..!
  • లలితా జ్యువలరీ అస‌లు ఓన‌ర్ “కిర‌ణ్ కుమార్” గారు కాదా.? “లలిత” అనే పేరు ఎలా వచ్చిందంటే.?
  • “యష్” నుండి… “మృణాల్ ఠాకూర్” వరకు… “సీరియల్స్” నుండి సినిమాల్లోకి వచ్చిన 10 యాక్టర్స్..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions