“జబర్దస్త్” స్టేజిపై “బంగారం” ఫేమ్…వీడియో వైరల్!!!

“జబర్దస్త్” స్టేజిపై “బంగారం” ఫేమ్…వీడియో వైరల్!!!

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో బంగారం అంటే చాలు వెంటనే ఒకటి చెప్పనా… ఛీ పోరా!! అనే డైలాగులు నోటి నుండి అలా వచ్చేస్తున్నాయ్. దీనంతటికీ కారణం, సోషల్ మీడియాలో బంగారం పేరుతో పోస్ట్ చేసిన ఒక అమ్మాయి వీడియోలే. అసలు ఆ అమ్మాయి ఎవరో! ఏం చేస్తుందో! తన రీల్ లైఫ్ వెనక రియల్ లైఫ్ స్టోరీ ఏంటో ఎవ్వరికీ తెలీదు. ఎటు చూసినా సోషల్ మీడియాలో ఆ అమ్మాయి మాటలే సందడి చేస్తున్నాయి.

Video Advertisement

బంగారం బంగారం అంటూ ఢీజేతో రేసౌండ్ వినిపిస్తోంది. అయితే ఈ బంగారం లైఫ్ స్టోరీ, గురించి తాను అనుభవించిన కష్టాలు, బాధల గురించి తాజాగా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోని ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ కదిలించింది.

ఆ బంగారం ఎవరో కాదు, తన పేరు శాంతి. స్వస్థలం నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే తండ్రి మతిమరుపు సమస్య వల్ల, ఎక్కడికో వెళ్ళిపోయారు. శాంతికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఊహా తెలియని వయసులోనే తండ్రి లేని జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి కోసం శాంతితో పాటు తన తల్లి వెతకని ఊరు, సందు బొందులు అంటూ ఏవీ లేవు. చివరికి వారి అన్వేషణకు తగిన ఫలితం రాకపోవడంతో… జీవితం ముళ్లపై నడకలాగా మారింది.

శాంతి తల్లికి 18 ఏళ్ళ వయసులోనే, 40 ఏళ్ల వయసున్న వ్యక్తితో వివాహం చేశారట. పరిస్థితుల దృష్ట్యా, కాలం వీరి జీవితాన్ని సమస్యల్లోకి నెట్టింది. తండ్రి కనపడకుండా పోవడంతో, శాంతి తల్లి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నది. కొందరు అయితే కఠినంగా ప్రవర్తించిన వైనం. తల్లిని కళ్ళ ముందే అందరూ క్రూరంగా కొట్టడం. ఇవన్నీ చూసిన శాంతి మనసు ఎంతో కృంగిపోయింది. ఇలా జీవితం ఎంతో కష్టంగా అనిపించింది శాంతికి.

శాంతి 10 వ తరగతి వరకు చదువుకుని. డబ్బులు లేక ఏవో పనులకు వెళుతుండేది. మధ్య మధ్యలో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారంలో వీడియోలు చేస్తూ ఉండేది. కానీ ఒకరోజు శాంతికి ఎందుకో ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఆలోచన వచ్చింది. దాంతో తన సొంతంగా వినూత్న ఆలోచనలకు తావు ఇచ్చింది. అలా బంగారం ఒకటి చెప్పనా… ఛీ పోరా అంటూ అనేక సొంత మాటలతో చాలా ఫేమస్ అయిపోయింది.

ప్రతీ ఒక్కరూ అదే వీడియో చూడటం, ఆ డైలాగులు మీదే ఇతర నటులు అందరూ రీల్స్ చెయ్యడం. ఆఖరికి ఆ డైలాగులు మీద డీజే క్రియేట్ చెయ్యడం. ఒకరకంగా చెప్పాలంటే శాంతి బంగారం దిలాగుతో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ చేసింది. దీని తర్వాత ఎక్కడికి వెళ్ళినా నువ్వు బంగారం కదా, ఒక సెల్ఫీ ఇవ్వవా అంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకేముంది శాంతి ఒక చిన్న పాటి సెలబ్రిటీ అయిపోయింది. జీవితంలో ఎన్ని కష్టాలు ఏడురుకున్నా, అందరినీ నవ్వించాలి అనే మంచి మనసు ఉన్న శాంతి, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇది ఇలా ఉండగా…సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వాళ్ళు జబర్దస్త్ స్టేజి కి రావడం కొత్తేమి కాదు. జబర్దస్త్ లో బంగారం ఫేమ్‌ శాంతికి సంబంధించిన ప్రాక్టీసు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె జబర్దస్త్ స్టేజీపై ఉన్న ఫొటోలు తో పాటు హైపర్ ఆది, జడ్జి ఇంద్రజ, చలాకీ చంటీ లతో తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చంటి టీం లో ఆమె పెర్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

watch video:

https://www.instagram.com/reel/CgtNgachDr1/

watch video:

 


End of Article

You may also like