“బంగారం ఒకటి చెప్పనా.?” అంటూ ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ అయిన ఈ అమ్మాయి రియల్ లైఫ్ గురించి తెలుసా.?

“బంగారం ఒకటి చెప్పనా.?” అంటూ ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ అయిన ఈ అమ్మాయి రియల్ లైఫ్ గురించి తెలుసా.?

by Mohana Priya

Ads

ఈ మధ్య కాలంలో బంగారం అంటే చాలు వెంటనే ఒకటి చెప్పనా… ఛీ పోరా!! అనే డైలాగులు నోటి నుండి అలా వచ్చేస్తున్నాయ్. దీనంతటికీ కారణం, సోషల్ మీడియాలో బంగారం పేరుతో పోస్ట్ చేసిన ఒక అమ్మాయి వీడియోలే. అసలు ఆ అమ్మాయి ఎవరో! ఏం చేస్తుందో! తన రీల్ లైఫ్ వెనక రియల్ లైఫ్ స్టోరీ ఏంటో ఎవ్వరికీ తెలీదు. ఎటు చూసినా సోషల్ మీడియాలో ఆ అమ్మాయి మాటలే సందడి చేస్తున్నాయి.

Video Advertisement

బంగారం బంగారం అంటూ ఢీజేతో రేసౌండ్ వినిపిస్తోంది. అయితే ఈ బంగారం లైఫ్ స్టోరీ, గురించి తాను అనుభవించిన కష్టాలు, బాధల గురించి తాజాగా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోని ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ కదిలించింది.

ఆ బంగారం ఎవరో కాదు, తన పేరు శాంతి. స్వస్థలం నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే తండ్రి మతిమరుపు సమస్య వల్ల, ఎక్కడికో వెళ్ళిపోయారు. శాంతికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఊహా తెలియని వయసులోనే తండ్రి లేని జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి కోసం శాంతితో పాటు తన తల్లి వెతకని ఊరు, సందు బొందులు అంటూ ఏవీ లేవు. చివరికి వారి అన్వేషణకు తగిన ఫలితం రాకపోవడంతో… జీవితం ముళ్లపై నడకలాగా మారింది.

శాంతి తల్లికి 18 ఏళ్ళ వయసులోనే, 40 ఏళ్ల వయసున్న వ్యక్తితో వివాహం చేశారట. పరిస్థితుల దృష్ట్యా, కాలం వీరి జీవితాన్ని సమస్యల్లోకి నెట్టింది. తండ్రి కనపడకుండా పోవడంతో, శాంతి తల్లి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నది. కొందరు అయితే కఠినంగా ప్రవర్తించిన వైనం. తల్లిని కళ్ళ ముందే అందరూ క్రూరంగా కొట్టడం. ఇవన్నీ చూసిన శాంతి మనసు ఎంతో కృంగిపోయింది. ఇలా జీవితం ఎంతో కష్టంగా అనిపించింది శాంతికి.

తల్లికి ఆరోగ్యం బాగుండేది కాదు, ఆపరేషన్ కి డబ్బులు ఉండేవి కావు. అతి చిన్న వయసులోనే తమ్ముడు ఆటో నడుపుతూ, వాటర్ క్యాన్ లు మోస్తూ ఇంటిని సాకే వాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు శాంతిని ఇంట్లో ఉంచితే, అమ్మాయి కాదా ఏమైనా చేస్తారేమో అనే భయానికి హాస్టల్లో వేసిందట, శాంతి (బంగారం) తల్లి. ఎవరు ఎన్ని మాటలు అన్నా పిల్లల కోసమే పరితపించేది ఆ అమ్మ మనసు. అలా శాంతి 10 వ తరగతి వరకు చదువుకుని. డబ్బులు లేక ఏవో పనులకు వెళుతుండేది.

మధ్య మధ్యలో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారంలో వీడియోలు చేస్తూ ఉండేది. కానీ ఒకరోజు శాంతికి ఎందుకో ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఆలోచన వచ్చింది. దాంతో తన సొంతంగా వినూత్న ఆలోచనలకు తావు ఇచ్చింది. అలా బంగారం ఒకటి చెప్పనా… ఛీ పోరా అంటూ అనేక సొంత మాటలతో చాలా ఫేమస్ అయిపోయింది.

ప్రతీ ఒక్కరూ అదే వీడియో చూడటం, ఆ డైలాగులు మీదే ఇతర నటులు అందరూ రీల్స్ చెయ్యడం. ఆఖరికి ఆ డైలాగులు మీద డీజే క్రియేట్ చెయ్యడం. ఒకరకంగా చెప్పాలంటే శాంతి బంగారం దిలాగుతో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ చేసింది. దీని తర్వాత ఎక్కడికి వెళ్ళినా నువ్వు బంగారం కదా, ఒక సెల్ఫీ ఇవ్వవా అంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకేముంది శాంతి ఒక చిన్న పాటి సెలబ్రిటీ అయిపోయింది. జీవితంలో ఎన్ని కష్టాలు ఏడురుకున్నా, అందరినీ నవ్వించాలి అనే మంచి మనసు ఉన్న శాంతి, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే శాంతికి ఇంకా కొన్ని ఆటంకాలు బంధువుల రూపంలో అలానే ఉన్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తన తండ్రి గురించి కానీ, బంధువుల గురించి కానీ మాట్లాడితే బెదిరింపులు కూడా వస్తున్నాయి అట. కానీ ఇవేమీ శాంతిని ఇప్పుడు భయపెట్టట్లేదు. నా తండ్రి నా ప్రేమ నా ఇష్టం. రండి ఎవరు ఏమ్ చేస్తారో చూస్తా అని అంత ధైర్యంగా, జవాబు ఇచ్చే స్థాయిలో శాంతి నిలబడగలిగింది. ఎన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురైనా… వాటిని ఏడురుకోడానికి శాంతి సిద్ధంగా ఉంది.

ఇకపోతే శాంతికి నటనపై ఎంతో మక్కువ ఉందట. ఎలాంటి పాత్ర పోషించడానికి అయినా తను రెడీ అని, నటించడం అంటే తనకు చాలా ఇష్టమని, ఎవరైనా మంచి మనసుతో ఒక్క అవకాశం ఇస్తే తన టాలెంట్ చూపించి నిరూపించుకుంటానని, కోరింది. తన సొంత కాళ్ళ మీద నిలబడి, ఒక సొంత ఇల్లు కట్టుకుని తన అమ్మకి బహుమానంగా ఇచ్చి.. కుటుంబానికి అండగా నిలవాలి అనేది ఇప్పుడు తన జీవితంలో పెద్ద కల అని చెప్పుకొచ్చింది.

ఇది చూసి ఎంతో మంది ప్రేక్షకులు తొలుత కంట తడి పెట్టుకున్నారు. జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా, అందరినీ నవ్విస్తున్న శాంతిని ఏంతో అభినందిస్తున్నారు నెటిజన్లు. ప్రతీ నవ్వు వెనక ఒక బలమైన విషాదం ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ శాంతికి మరిన్ని అవకాశాలు వచ్చి, అనుకున్న కల నెరవేర్చుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

watch video:

https://www.instagram.com/reel/CgtNgachDr1/

watch video:

 


End of Article

You may also like