ఇన్‌స్టాలో ట్రెండ్ అయ్యే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె బాబాయి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్.!

ఇన్‌స్టాలో ట్రెండ్ అయ్యే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె బాబాయి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్.!

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. ఎన్నో కొత్త టాలెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. మరి కొంత మంది పాటలు పాడుతూ, మరి కొంత మంది డాన్స్ చేస్తూ కూడా ఫేమస్ అవుతున్నారు.

Video Advertisement

ఇంకా కొంత మంది అయితే ఫ్యాషన్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ చెప్తూ ఉంటారు. కొంత మంది అయితే వంటలు కూడా చేస్తారు. ఫేమస్ అవ్వడానికి ఏ దారి అయినా సరే ఎంచుకోవచ్చు అనడానికి ఉదాహరణలుగా నిలుస్తున్నారు. వారి టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా నిరూపించుకుంటున్నారు.

instagram influencer boyapati devika

అలా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వ్యక్తి బోయపాటి దేవిక. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, ఫోటో షూట్ చేస్తూ, బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది దేవిక. ఇటీవల చాలా ఫేమస్ అయిన దేవిక ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తోంది. అయితే దేవిక సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయి. దేవిక బాబాయ్ ఒక ఫేమస్ డైరెక్టర్. ఆయన మరెవరో కాదు. బోయపాటి శ్రీను. ఆ అమ్మాయి పేరు చూసిన చాలా మందికి ఈ విషయం అర్థం అయిపోయి ఉంటుంది. దేవిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి వ్యక్తిగత విషయాలను చెప్పింది.

https://www.instagram.com/p/C22Ki_CpPzD/

2 boyapati

ఇటీవల దేవిక ఇంటర్వ్యూ ఇస్తూ, తన బాబాయి బోయపాటి శ్రీను అని చెప్పింది. బోయపాటి దేవిక విజయవాడలో పెరిగింది. బీటెక్ చదివింది. బోయపాటి శ్రీను తనకి దగ్గర బంధువు అని చెప్పింది. అయితే, “మరి బోయపాటి శ్రీను సినిమాల్లో నటిస్తాను అని ఎప్పుడు అడగలేదా?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకి, తనకి మహేష్ బాబు అంటే ఇష్టం అని, ఒకవేళ మహేష్ బాబు తో సినిమా తీస్తే ఆ సినిమాలో ఏదైనా పాత్ర ఇవ్వమని చెప్పాను అని చెప్పింది, అందుకు బోయపాటి శ్రీను కూడా, “టైం రావాలి కదమ్మా” అన్నారట. ప్రస్తుతం దేవిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది.

 

ALSO READ : పేటీఎం ఫిబ్రవరి 29 తరువాత పనిచేయదా..? ఈ లోగా కస్టమర్లు ఏం చేయాలి..?


End of Article

You may also like