అమ్మా నాన్న నన్ను క్షమించండి..! నేను మళ్ళీ తిరిగి వస్తాను..!

అమ్మా నాన్న నన్ను క్షమించండి..! నేను మళ్ళీ తిరిగి వస్తాను..!

by kavitha

Ads

మహబూబాబాద్ జిల్లాలోని బోడగుట్టతండాలో ఒక ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ లో సీట్ రాదేమోనన్న భయాందోళనతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ విద్యార్థి ఫ్యామిలీ బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే,

Video Advertisement

కేసముద్రం మడంలంలోని బోడగుట్ట తండాలో నివసించే గుగులోతు లచ్చు, జ్యోతి అనే జంటకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద అబ్బాయి కృష్ణ ఏటూరు నాగారంలోని ఇంటర్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి ప్రభాకర్ 10వ తరగతి. ఇంటర్ చదివే కృష్ణ ఎంబీబీఎస్ చదవాలని, డాక్టర్ అవ్వాలనే కోరికతో ఇంటర్ లో బైపీసీ తీసుకున్నాడు.  రీసెంట్ గా ఇంటర్ పరీక్షలు రాశాడు. నీట్ ఎంట్రెన్స్ కోసం ఇంటి దగ్గరే చదువుకుంటూ, ప్రిపేర్ అవుతున్నాడు.
Mahabubabad-Studentఈ క్రమంలో కృష్ణ తండ్రి లచ్చు మంగళవారం నాడు మిర్చి పంటను అమ్మడం కోసం కేసముద్రంకు వెళ్లాడు. అతని తల్లి పొలానికి, తమ్ముడు టెన్త్ క్లాస్ పరీక్షలు తాయడం కోసం వెళ్లాడు. ఆ సమయంలో కృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అయితే తనకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అని మనస్తాపం చెందిన కృష్ణ, తన కల నెరవేరకుంటే బతికున్న లాభం లేదనుకుని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తూ లెటర్ రాసి పెట్టి, ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
east-godavari-daughter1మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతని తాత తలుపులు తెరవగా ఫ్యానుకు ఉరేసుకొని కృష్ణ కనిపించాడు. ఆయన వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని అలా  చూసి  కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఎదిగాడు అనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో రోధింస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈమధ్య కాలంలో చిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనో, అమ్మ తిట్టిందనో, నాన్న ఫోన్ కొనివ్వట్లేదనో, ఇలాంటి  చిన్న చిన్న వాటికే  విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సమస్యలు వచ్చినపుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయంలో వాటికి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడడం అందరిని కలవరపాటుకు దూరి అయ్యేలా చేస్తోంది.

Also Read: తండ్రి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో… ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like