Ads
ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం భారత్ లో క్రికెట్ అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సందడి మాములుగా లేదు. అయితే..ఈ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో స్టేడియంలో చుట్టూ ఉండేవాళ్ళల్లో కొంతమంది అనూహ్యంగా ఫేమస్ అయిపోతూ ఉంటారు.
Video Advertisement
ఇటీవలే ఓ యువ జంట మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ముద్దు పెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో బ్యూటీ కూడా కెమెరా కంటికి చిక్కి యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందాం. ఇలా ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న టైములో అమ్మాయిలు కెమెరా కంట పడి ఫేమస్ అయిపోవడం ఇదేమీ మొదటి సారి కాదు. ఈ ఏడాది కూడా ఓ అమ్మాయి అలానే ఫేమస్ అయిపొయింది. అయితే.. ఈ అమ్మాయి ఎవరో తెలియకపోవడంతో మిస్టరీ గర్ల్ గా మిగిలిపోయింది. ఈ మిస్టరీ గర్ల్ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ కావడంతో నెటిజన్లు కెమరామెన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
మరో వైపు ఈ బ్యూటీ ఎవరో తెలుసుకోవాలని అందరు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. CSK ఫ్యాన్ గర్ల్ గా ఫేమస్ అయిన ఈ అమ్మాయి పేరు దేవికా నాయర్. ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ గా పని చేస్తున్న దేవికా తాను వైరల్ అయిన ఫోటోను స్వయంగా షేర్ చేసింది. ఆమె ఫోటో వైరల్ అవ్వగానే అనూహ్యంగా ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు 22,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. గతంలో 2019 లో RCB మ్యాచ్ సందర్భంగా దీపికా ఘోష్ అనే అమ్మాయి కూడా ఇలానే వైరల్ అయ్యి.. ఆ తరువాత బాగా ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే.
End of Article