అఖిల్ ని “అయ్యగారు” గా మార్చేసిన ఈ ఫ్యాన్ ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

అఖిల్ ని “అయ్యగారు” గా మార్చేసిన ఈ ఫ్యాన్ ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

by Anudeep

Ads

సినిమా హీరోలు అన్నాక ఫ్యాన్ ఫాలోయింగ్ సహజం. కానీ వారి ఫ్యాన్ కె ఫాలోయింగ్ ఉండడం ఎక్కడైనా చూసారా? అక్కినేని అఖిల్ ఫ్యాన్ కి కూడా ఫాలోయింగ్ ఉంది. విపరీతమైన అభిమానంతో ఇతగాడు అభిమానుల్ని సంపాదించేసుకున్నాడు. అక్కినేని అఖిల్ ను అయ్యగారు అని సంబోధిస్తూ.. అప్పట్లో ఇతను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ అఖిల్ ని అయ్యగారిని చేసేశాయి.

Video Advertisement

akkineni 1

ఈ ఫ్యాన్ గురించి ఇటీవలే అఖిల్ కూడా స్పందించారు. తనకంటే తన ఫ్యాన్ కె ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం గర్వంగా ఉందన్నారు. తప్పకుండ అతనిని కలుస్తాను.. అతను హ్యాపీగా ఉండాలి అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు. ఇంతకీ అఖిల్ ని అయ్యగారిని చేసేసిన ఆ అభిమాని ఎవరో తెలుసా..? అతను ఎక్కడివాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

akkineni 2

అతని పేరు నాగరాజు. గుంటూరులో ఓ దినసరి కూలిగా పని చేస్తూ ఉన్నాడు. చిన్నతనం నుంచే నాగరాజుకు సినిమాలంటే అమితాసక్తి. అక్కినేని హీరోల సినిమాలు రిలీజ్ అయితే విపరీతంగా చూసేవాడట. అక్కినేని నాగార్జున అంటే కూడా నాగరాజుకు చాలా ఇష్టమట. అయితే నాగ్ నటించిన సినిమా ఏది రిలీజ్ అయినా.. థియేటర్ వద్దకు వెళ్ళిపోయి కింగ్ కింగ్.. అంటూ నానా హంగామా చేసేస్తూ ఉంటాడు.

akkineni 3

అలాగే.. నాగ్ నటించిన “రాజు గారి గది 2 ” సినిమా గుంటూరు లో పల్లవి కాంప్లెక్స్ ధియేటర్ లో రిలీజ్ అయింది. అక్కడకి నాగరాజు కూడా వెళ్ళాడు. కానీ ఆ సినిమా నాగరాజు కు అంతగా నచ్చకపోవడంతో అప్ సెట్ అయ్యాడు. ఆ ఫ్రస్టేషన్ లో అక్కినేని అఖిల్ గురించి మాట్లాడాడు.. “కింగ్ కొడుకు రావాలి.. అఖిలే నెంబర్ వన్.. అయ్యగారు రావాల్సిందే.. కింగ్ కొడుకు…” అంటూ థియేటర్ బయట రచ్చ చేసాడు.

akkineni 4

అప్పట్లో ఈ వీడియో చాలా పాపులర్ అయింది. అఖిల్ ను అయ్యగారు అంటూ ట్రోల్ల్స్ కూడా చేసారు. అఖిల్ కి అయ్యగారు అనే పేరుని ఫిక్స్ చేసేసారు. మరో వైపు అక్కినేని సినిమా ఏది రిలీజ్ అయినా నాగరాజు వెళ్లి చూస్తూ ఉంటాడు. అలా నాగరాజు కి కూడా మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యాన్ అన్న బిరుదు వచ్చేసింది. నాగరాజు పై కూడా చాలా మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. నాగరాజు అక్కినేని సినిమా రిలీజ్ అయినప్పుడే థియేటర్ల వద్ద సందడి చేస్తాడు. అతనికి ఉన్న పాపులారిటీని వాడుకోవడం కూడా అతనికి తెలియదు. ఎంతో నిస్వార్ధంగా అక్కినేని కుటుంబాన్ని అభిమానిస్తూ ఉన్నాడు.


End of Article

You may also like