“ఆ సీన్ ఉంటేనే సినిమా నడుస్తుంది”.. అంటూ అప్పట్లో ప్రేక్షకులు ధర్నా చేసారని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

“ఆ సీన్ ఉంటేనే సినిమా నడుస్తుంది”.. అంటూ అప్పట్లో ప్రేక్షకులు ధర్నా చేసారని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

ఆలోచింపచేసే విధంగా వినోదాత్మక చిత్రాలు తీయడంలో జంధ్యాల గారు దిట్ట. ఆయన తరువాత స్థానం ఇవివి సత్యనారాయణ గారికే చెందుతుంది. “చెవిలో పువ్వు” సినిమాతో ఆయన సినిమా ఇండస్ట్రీ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో సినిమాలను తీశారు. ఆయన తీసిన వాటిల్లో కూడా ఎన్నో వినాదాత్మక చిత్రాలు, సీరియస్ సినిమాలు ఉన్నాయి.

Video Advertisement

Evv sathyanarayana

ఎక్కువగా ఆయన మధ్యతరగతి కుటుంబ కధాంశాలను ఎన్నుకునేవారు. 1994 ప్రాంతంలో వచ్చిన హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయి గారు, ఆమె సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించాయి. సిరి చిత్ర నిర్మాణం లో, ఇవివి దర్శకుడు గా “ఆమె” సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించగా.. హీరోయిన్ గా ఊహ నటించారు.

aame 1

అప్పటికే “అహనా పెళ్ళంట” సినిమా రిలీజ్ అయింది. అందులో పిసినారిగా కోట శ్రీనివాస్ రావు కనబరిచిన నటన ఎంతగానో ఆకట్టుకుంది. “ఆమె” సినిమాలో కూడా ఇవివి, కోటా శ్రీనివాసరావుకు అలాంటి పాత్రనే ఇచ్చారు. ఈ పాత్ర అజ్ఞానం, మూర్ఖత్వం కలగలిపి ఉంటుంది. ఈ పాత్రకు కూడా కోట గారు వందశాతం న్యాయం చేసారు. ఈ సినిమాలో కోటా గారిది ఓ సన్నివేశం ఉంటుంది.

aame 2

ఈ సినిమా పతాక సన్నివేశంలో.. కోటా గారి భార్యగా నటించిన సుధ అనే అమ్మాయి కోటా శ్రీనివాస రావు గుండెలపై కాలు పెట్టి స్త్రీ అబల కాదు.. సబల.. అంతే కాదు ఆది పరాశక్తి” అని ఓ డైలాగు చెబుతుంది. తొలుత కధలో భాగంగా ఈ సన్నివేశం ఉంటె బాగుంటుంది అని తీశారు. కానీ ఆ తరువాత ఆ దృశ్యాన్ని తీసేసారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక విజయవాడ లో ఓ థియేటర్ వద్ద ప్రేక్షకులు గొడవ గొడవ చేసారు. ఆ సీన్ ఉంటె తప్ప సినిమా నడవదని ధర్నాకు దిగారు. ఈ విషయాన్నీ నటి సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


End of Article

You may also like