“మంచు విష్ణు” భార్య “వెరోనిక” గురించి ఈ విషయాలు తెలుసా.? డాక్టర్ అవ్వాలనుకొని ఎందుకు ఆగిపోయారంటే.?

“మంచు విష్ణు” భార్య “వెరోనిక” గురించి ఈ విషయాలు తెలుసా.? డాక్టర్ అవ్వాలనుకొని ఎందుకు ఆగిపోయారంటే.?

by Anudeep

Ads

మోహన్ బాబు సినిమా వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మంచు విష్ణు.  విష్ణు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా విష్ణు ఎన్నో విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Video Advertisement

2021లో మా ఎలక్షన్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విష్ణు. అటు పదవిని, ఇటు సినిమాల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.

అసలు విషయానికొస్తే 2009 మార్చి 1న తేదీన వెరోనిక ని వివాహం చేసుకున్నారు. మంచు విష్ణు సినిమా బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన వారు అయితే, వెరోనిక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన అమ్మాయి. ఈమె స్వయానా స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు సుధాకర్ రెడ్డి మరియు విద్యా రెడ్డి దంపతులకు కుమార్తె. ఈమె పుట్టి పెరిగింది అమెరికాలో, తల్లిదండ్రులిద్దరూ వ్యాపారవేత్తలు.

Vishnu family

ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం అయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చెల్లెలు అవుతుంది వెరోనిక. రాజా రెడ్డి ఫ్యామిలీ లో ఈమె చిన్న మనవరాలు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తన కన్న కూతురు షర్మిల తో సమానంగా, వెరోనికని కూడా చూసుకునేవారు.

ఈమె చదువుకునే సమయంలో డాక్టరు కావాలని అనుకుందట. కానీ స్కూల్ లో చదువుకునే సమయంలో వాలంటీర్గా సేవలు అందించడానికి ఆస్పత్రికి వెళ్ళింది. ఆస్పత్రిలో చనిపోయినవారిని  చూసి భయపడిపోయింది. దీంతో కాస్త డాక్టర్ కావాలని ఆమె నిర్ణయానికి స్వస్తి చెప్పేసింది.

Vishnu wife

మంచు విష్ణు నటించిన ఢీ చిత్రంలో వెరోనిక అతని కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిందట. విష్ణు మంచితనం యాటిట్యూడ్ నచ్చడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి, పరిచయం ప్రేమగా మారింది.

2009 మార్చి ఒకటో తేదీన వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లకు ప్రస్తుతం నలుగురు సంతానం. డాక్టర్ కావాలన్న వెరోనిక చివరకు యాక్టర్ భార్య అయిపోయింది. విష్ణు ప్రతి పనిలోనూ విష్ణుకి ఎంతో అండగా నిలుస్తుంది వెరోనిక.


End of Article

You may also like