గత 30 యేళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటిస్తున్న ఇతను ఎవరో తెలుసా? తన పేరు మీద “రికార్డింగ్ డాన్స్”.!

గత 30 యేళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటిస్తున్న ఇతను ఎవరో తెలుసా? తన పేరు మీద “రికార్డింగ్ డాన్స్”.!

by Harika

Ads

మన ఫేవరెట్ హీరోలు తెరమీద వీర లెవెల్లో ఫైటింగ్ చేస్తూ ఉంటే మనం ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము, రిస్కీ షాట్స్ చేస్తుంటే వాళ్లకి ఏమైపోతుందో అని కంగారు పడిపోతారు డై హాట్స్ ఫ్యాన్స్. అయితే చాలా రిస్కీ షార్ట్స్ ఒరిజినల్ హీరోలు కాకుండా వాళ్ళ డూప్స్ చేస్తారని చాలామందికి తెలుసు. కష్టం డూప్స్ ది అయితే క్రెడిట్ మాత్రం ఒరిజినల్ హీరోలది. చూడటానికే అచ్చం ఒరిజినల్ హీరోలాగే ఉండే డూప్ లు వాళ్ళ ప్రాణాలను రిస్క్ చేసి మరీ డాన్స్ లు ఫైట్లు చేస్తూ ఉంటారు.

Video Advertisement

అలాగే చిరంజీవికి కూడా ఒక డూప్ ఉన్నారు, ఆయన 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా నటిస్తున్నారు. అతని పేరు ప్రేమ్ కుమార్. పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ప్రేమ్ కుమార్ తన పేరు మీద ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్ అనే ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా నటిస్తున్నానని చెప్పటంతో ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

ప్రేమ్ కుమార్ చూడటానికి అచ్చం చిరంజీవిలాగే ఉంటారు. ఏమరపాటుగా చూస్తే మనం చిరంజీవి అనే అనుకుంటాము. ఈయన ప్రస్తుతం రికార్డింగ్ డాన్సర్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ సినీ ప్రయాణం రికార్డింగ్ డాన్స్ ల నుంచే మొదలైంది. ప్రేమ్ కుమార్ ఆరేళ్ల వయసు నుంచే స్టేజి షోలు చేసేవాడు, సినిమా పాటలకు ఎక్కువగా డాన్స్ చేసేవాడు.

చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేమ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమాలో నటించాడు. రాక్షసుడు, మరణ మృదంగం వంటి సినిమాలలో చిరంజీవికి డూప్ గా నటించాడు. అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా చిరంజీవికి డూప్ గా నటించాడు. దాదాపు 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ లో కూడా డూప్ గా నటించే అవకాశాలు ఉన్నాయి.


End of Article

You may also like