Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. సినిమా కోసం పనిచేసిన వారందరూ చాలా కష్టపడ్డారు. చిన్న చిన్న విషయాల నుండి పెద్ద వాటి వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
#1 సినిమాకి ముందు అనుకున్న షూటింగ్ రోజులు 200 రోజులు. కానీ సినిమా షూట్ అయింది 300 రోజులు.
#2 ఈ సినిమాలోని నాటు నాటు పాట ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. పాటలోని హుక్ స్టెప్ కోసం చాలా టేక్స్ తీసుకున్నారు.
#3 ఢిల్లీ అని చూపించే ప్రదేశమంతా హైదరాబాద్ లో గండిపేట్ లో ఒక పది ఎకరాల స్థలంలో వేశారు.
#4 ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ బల్గేరియాలో తీశారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ లో తీశారు.
#5 సినిమాకి రిహార్సల్స్, ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ కోసం 200 రోజులు అయ్యాయి.
#6 రాజమౌళి లండన్ కి చెందిన ప్రముఖ గ్రాఫిక్స్ కంపెనీ అయిన మూవీ పిక్చర్ కంపెనీని సంప్రదించి, ఎన్టీఆర్ కి, పులికి మధ్య వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ చేయమని అడిగారు.
#7 ఈ సినిమా కోసం 3000 టెక్నీషియన్లు, 9 మంది కో-డైరెక్టర్స్ పని చేశారు.
#8 లండన్ నుండి 2500 మంది స్టంట్ మెన్ అలాగే ఇతర ఫారిన్ కంట్రీల నుండి 50 మంది స్టంట్ మెన్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లో నటించారు.
#9 సినిమా కోసం అనుకున్న బడ్జెట్ 300 కోట్లు అయితే సినిమాకి అయిన బడ్జెట్ బడ్జెట్ 500 కోట్లు.
చాలా కారణాల వల్ల సినిమా విడుదల కూడా చాలా సార్లు వాయిదా పడింది. ఇవే ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
End of Article