SS Rajamouli: మహేష్ బాబుతో అలాంటి కథ.. ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..!

SS Rajamouli: మహేష్ బాబుతో అలాంటి కథ.. ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..!

by kavitha

Ads

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఇప్పటివరకు SSMB29 సినిమా గురించి ఏ వివరాలు బయటకు రాకపోయినా, ఈ మూవీ పై ఇప్పటికే  భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ లాంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి  వెళ్లిన జక్కన్న.

Video Advertisement

సూపర్‌స్టార్‌ మహేష్ బాబబుతో మూవీ  అంటే  ఎంత ఇంట్రెస్ట్  ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. SSMB29  అనౌన్స్‌మెంట్‌ కాకుండా, ఇప్పటి వరకూ దీని పై ఎలాంటి విషయాలు తెలియలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీప్రొడక్షన్‌ పనులు అవుతున్నాయని   చెబుతున్నారు. ఇక రాజమౌళి విదేశాల్లో  RRR మూవీ ప్రమోషన్లలోనే  ఉన్నాడు. అసలు SSMB29 నెక్స్ట్ ఇయర్  అయినా స్టార్ట్ అవుతుందా లేదా  అన్నది కూడా డౌటే. అయితే  ఇప్పుడు దర్శకుడు రాజమౌళి సినిమా  గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.ssmb29-telugu-addaడైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి ముఖ్యమైన  అప్‌డేట్‌ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్‌ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో  అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్  అనిపించింది. ఈ సినిమాకి  మహేష్‌ బాబునే పర్ఫెక్ట్  ఛాయిస్‌. ఇలాంటి సబ్జెక్ట్‌కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే  ఒక  అడ్వెంచరస్‌ సినిమా  అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
mahesh babu 1 telugu addaగతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్‌ జంగిల్‌ అడ్వెంచర్‌ కథను రాయబోతునట్లు  కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా  రాజమౌళి కూడా అదే  కథని  చెప్పాడు. యాక్షన్‌,అడ్వెంచర్‌, థ్రిల్స్‌ అన్ని ఎస్‌ఎస్‌ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా  షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో  నటించబోయే నటీనటుల గురించిన  వివరాలు తెలియాల్సి  ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్‌లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు.  అవన్నీ పూర్తయితే కానీ ఎస్‌ఎస్‌ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.


End of Article

You may also like