ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం….తెల్లని యూనిఫామ్ వెనుక భరించలేనంత బాధ గురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి.!

ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం….తెల్లని యూనిఫామ్ వెనుక భరించలేనంత బాధ గురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి.!

by Megha Varna

Ads

Covid – 19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో.. తమ ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్నది నర్సులే…. సందర్భం ఏదైనా సాహసంతో సాగడమే వారికి తెలుసు…. రోగి కోలుకొని ఇంటికెళుతుంటే పట్టలేని సంతోషం వారిది.! సైనికుల మాదిరిగా రాత్రి0బవళ్ళు సేవ చేయడం, కుటుంబ సభ్యుల్లా రోగికి ఎక్కడా లేని ధైర్యాన్ని నూరిపోయడం…రోగి కంటే ఎక్కువగా రోగంతో పోరాటం చేయడం …ఇవన్నీ పెదవిపై చెరగని చిరునవ్వుతో చేయడం వారికే చెల్లుతుంది. అలాంటి నర్సులందరికి …. మనందరి తరపున Nurse’s day శుభాకాంక్షలు.

Video Advertisement

నర్సులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు:

ఎక్కువ వర్క్ – తక్కువ జీతం:
సాధారణంగా 8 మంది రోగులకు 1 నర్స్ ఉండాలి…కానీ మన దగ్గర మాత్రం 1 :500 రేషియో నడుస్తుంది .. దీన్ని బట్టి చెప్పొచ్చు వీరి పై ఉండే పని భారం. ICU విషయంలో అయితే 1:1 ఉండాలి కానీ మనదగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్ లో సైతం 1:10 ఉంటారు. ICU బిల్ ఎలా వేస్తారో మీ అందరికి తెలిసే ఉంటుంది …కానీ అదే ICU లో పనిచేసే నర్సుల జీతాలు మాత్రం 10,000 నుండి 20 వేలలోపే.! శాలరీ పెంచమంటే … ఆ పోస్ట్ ఊడినట్టే.!

చులకన భావం:
సినిమాల ప్రభావమో, సమాజం తీరో ఏమో కానీ నర్సులంటే చిన్న చూపు చూస్తారు. డ్యూటీ డాక్టర్లు ( కొందరు), పేషెంట్స్, పేషెంట్స్ వెంట వచ్చే అంటెండర్స్…అందరికీ వీరంటే చులకనే.! కార్పోరేట్ హాస్పిటల్స్ లో అయితే మరీను. సీనియర్ల టార్చర్ కూడా కొన్ని చోట్ల విపరీతంగా ఉంటుంది.

సెలవులు అడగొద్దు :
ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న జాబ్ కాబట్టి వారానికి రెండు సెలవులు ఇవ్వాలి. కానీ కొన్ని చోట్ల సిబ్బంది కొరత అంటూ వారానికి ఇచ్చే ఒక్క వీక్ ఆఫ్ ను కూడా కట్ చేస్తున్నారు. ఇక ఏదైనా పని మీద వారం రోజులు సెలవు కావాలంటే ..జాబ్ ఉంటుందో , ఊడుతుందో చెప్పలేని పరిస్థితి.!

కేరళ నర్సులతో నింపుతున్నారు:
సహజంగానే మళయాలీస్ నర్సింగ్ వృత్తిలోకి ఎక్కువగా వొస్తారు. మన హాస్పిటల్స్ వాళ్ళు సైతం వారికే పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే వాళ్ళు యాజమాన్యాన్ని ప్రశ్నించరు,సెలవులు అడగరు, తక్కువ జీతానికి పని చేస్తారు. దీంతో ప్రతి హాస్పిటల్ నర్సింగ్ పోస్ట్ లో వాళ్లే కనిపిస్తుంటారు.

తూ..తూ మంత్రపు కాలేజీలు: 
కట్ – కాపి- పేస్ట్ ….విధానాన్ని చాలా నర్సింగ్ కాలేజీలు ఫాలో అవుతున్నాయి. ఫీజు కట్టించుకోవడం, డైరెక్ట్ ఎగ్జామ్ రాయడం అనే విధానాన్ని అలవాటు చేశాయి. ప్రాపర్ టీచింగ్ లేకపోవడం , ప్రాక్టికల్స్ నాలెడ్జ్ లేకపోవడంతో …అవగాహనా లేని చాలా మంది ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు. దీంతో ఏంటో ఇష్టంతో నర్సింగ్ ను ఎంచుకున్న వారు నష్టపోతున్నారు.

నైట్ డ్యూటీలు:

స్టాఫ్ నర్సులు నెలలో కనీసం వారం రోజుల నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా అమ్మాయిలే నర్సింగ్ వృత్తిలో ఉంటారు …వారు కూడా నైట్ డ్యూటీ చేయాల్సిందే. రాత్రి వేళల్లో సెక్యూరిటి పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయనేది కొందరు నర్సుల వాదన.


End of Article

You may also like