“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” వెంకటేష్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” వెంకటేష్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

by Mohana Priya

Ads

విక్టరీ వెంకటేష్ కెరియర్ లో బెస్ట్ సినిమాల జాబితాలో ఉండే సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి. ఈ సినిమాకి దర్శకత్వం ఇంకా వెంకటేష్, సౌందర్యల నటన తో పాటు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం పర్ఫామెన్స్ కూడా ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

Video Advertisement

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లో నటించిన వెంకటేష్, సౌందర్య, వినీత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తో పాటు వెంకటేష్ – వినీత కొడుకు గా ఇంకొక ముఖ్య పాత్ర పోషించిన ఆ బాబు కూడా మీకు గుర్తుండే ఉంటాడు.

అతని పేరు నాగ అన్వేష్. అంత చిన్న వయసులో కూడా ఎంతో బాగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నాగ అన్వేష్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా తర్వాత కొన్ని సంవత్సరాల వరకు నాగ అన్వేష్ సినిమాల్లో కనిపించలేదు.

2015 లో వినవయ్యా రామయ్యా సినిమాతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగ అన్వేష్. ఈ సినిమాలో నాగ అన్వేష్ కి జోడీగా దృశ్యం సినిమా లో వెంకటేష్ పెద్ద కూతురు గా చేసిన కృతిక జయకుమార్ నటించారు.

తర్వాత 2017 లో ఏంజెల్ సినిమా లో నటించారు నాగ అన్వేష్. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా నాగ అన్వేష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.


End of Article

You may also like