Ads
శేఖర్ కమ్ముల దర్సకత్వం లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘లవ్ స్టోరీ’. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పాత్రలకి ప్రేక్షకులు ‘ఫిదా’ అయ్యారు. అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణని సంపాదించుకుని విజయవంతగా ముందుకు ప్రదర్శింపబడుతున్న ఈ సినిమా అమెరికా లో అప్పుడే వన్ మిలియన్ మార్క్ సాధించింది కలెక్షన్స్ లో.
Video Advertisement

Love Story Telugu Movie
లాంగ్ రన్ లో సుమారు 50 కోట్ల మేర షేర్ సాధించవచ్చు అనే అంచనాలకి వచ్చారు నిపుణులు. సూపర్ హిట్ దిశగా నడుస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ గురించి పలు భిన్న అభిప్రాయాలని వ్యక్తం చేసారు ఆడియన్స్. ఇంకా బాగుండాల్సింది క్లైమాక్స్, క్లైమాక్స్ ముగించిన తీరుని తప్పుబడుతున్నారు కొందరు.

Love Story Movie
అయితే శేఖర్ కమ్ముల గారు ఈ క్లైమాక్స్ ని అయిదు సార్లు తీసారట అలా తీసిన అయిదవ వెర్షన్ ని సినిమాలో పెట్టారని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో సాయి పల్లవి వాళ్ళ బామ్మ కి చెప్పు చూపించే సీన్స్ ని కూడా ఇటీవలే తీసారట. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా లీడర్ 2 రానాతో తీస్తానని ఇప్పటికే ప్రకటించారు.
End of Article