Ads
ఐపీఎల్ 2021 ఫేస్ 2 యుఎఇ లో జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల శనివారం రోజున ప్రకటన చేసారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ మ్యాచ్స్ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫేస్ 2 లో దాదాపు 31 మ్యాచ్స్ వరకు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Video Advertisement
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఐపీఎల్ జరిగే తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే.. సెప్టెంబర్ 19 నుంచి జరిగే అవకాశం ఉండచ్చని సమాచారం. అయితే.. అధికారికం గా ఐపీఎల్ జరిగే తేదీని ప్రకటించాల్సి ఉంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) శనివారం వర్చువల్ స్పెషల్ సర్వసభ్య సమావేశం (ఎస్జిఎం) ను నిర్వహించింది. ఈ సందర్భం గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తిరిగి ప్రారంభించాల్సిన అంశం పై చర్చలు జరిపారు.
End of Article