నీ బౌలింగ్ బాగోదు అందుకే టీం నుండి తీసేసారు అన్న నెటిజెన్ కు…ఇర్ఫాన్ పఠాన్ హైలైట్ కౌంటర్!

నీ బౌలింగ్ బాగోదు అందుకే టీం నుండి తీసేసారు అన్న నెటిజెన్ కు…ఇర్ఫాన్ పఠాన్ హైలైట్ కౌంటర్!

by Anudeep

ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అభిమానులకి ఎవ్వరు మరచిపోలేని పేరు..అల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ లైఫ్ హ్యాండ్ స్వింగ్ బౌలర్ ..లెజెండ్ కపిల్ దేవ్ తరువాత అంతటి పేరుని సంపాదించుకున్నాడు..ఓపెనర్ గా కూడా కొన్ని రోజులు టీం ఇండియా కి తన సేవలు అందించాడు.అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈ సంవత్సరం మొదట్లో క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పారు.తన రిటైర్మెంట్ ని జీరించుకోలేని ఫాన్స్ మరి కొన్ని అవకాశాలు వచ్చి ఉంటె బాగుండేవేమో అని అభిప్రాయపడ్డారు.

Video Advertisement

ఇర్ఫాన్ పఠాన్ 2003 వ సంవత్సరం లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టారు.120 వన్డేలు,29 టెస్ట్ మ్యాచ్లు,24 t20 లు టీం ఇండియా తరుపున ఆడారు.తన చివరి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా తరపున ఆడారు ఆడిన రెండు ఇన్నింగ్స్ లోను ఏడవ స్థానంలో దిగి 21 ,43 స్కోర్ చేసాడు,తన చివరి t20 ఆస్ట్రేలియా మీద,చివరి వన్డే ని శ్రీలంక మీద ఆడాడు.

https://twitter.com/amal_sachinism/status/1261578432040759296

తన ఆటకి సంబంధించి గణాంకాలని చూపిస్తూ తన ఆటతీరు నాకేమి నచ్చలేదు అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజి ని జత పరిచి ఏమన్నాడు అంటే ‘రెండు ఇన్నింగ్స్ లో కేవలం 63 పరుగులు మాత్రమే చేయడం బాధించింది అంటూ అసహనం వ్యక్త పరిచాడు.దీనికి రిప్లై ఇస్తూ స్టయిన్,మోర్కెల్ వంటి మేటి బౌలర్ లతో ఆడుతుంటే కేవలం 63 పరుగులే అందులో చేస్తే అదే చివరి టెస్ట్ మ్యాచ్ అవుతుంది అంటూ రీట్వీట్ చేసాడు.

మరొక నెటిజెన్ నీ చెత్త బౌలింగ్ మరియు వికెట్ కూడా సాధించలేకపోవడం వలనే జట్టులో స్థానాన్ని కోల్పోయావు అంటూ విమర్శించగా ఈ మ్యాచ్ లో నేను ఒక్కడినేనా వికెట్ లేకుండా మ్యాచ్ ని ముగించిన ఆటగాడిని?దీని వెనుకటి మ్యాచ్ లో నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిన సంగతి మరచిపోయావా ?? ఓ అప్పటికి ఇంకా నువ్ పుట్టి ఉండవు లే బహుశా అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు..

 


You may also like

Leave a Comment