Home Filmy Adda మేఘనా రాజ్ తో పెళ్లి పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్ ప్రథమ్..!

మేఘనా రాజ్ తో పెళ్లి పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్ ప్రథమ్..!

by Anudeep

కన్నడ నటుడు చిరంజీవి సర్జా జూన్ 7, 2020 న తీవ్రమైన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటికే అతని భార్య మేఘన రాజ్ గర్భవతి గా ఉంది. తాజాగా.. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన భర్త మరణించిన ఐదు నెలల తర్వాత రాయన్ రాజ్ సర్జాకు జన్మించిన మేఘనా రాజ్ దాదాపు ఏడాది కాలం తరువాత తిరిగి వార్తల్లోకి వచ్చారు.

meghana raj

మేఘన మరియు బిగ్ బాస్ కన్నడ 4 విజేత ప్రథమ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు పేర్కొన్నాయి. అయితే ఈ వీడియో లపై ప్రథమ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ట్విట్టర్ మాధ్యమం గా స్పందించిన ప్రథమ్.. తన పోస్ట్ లో ఓ స్క్రీన్ షాట్ ను పంచుకున్నాడు. ఇలాంటి వీడియో లపై చట్టబద్ధం గా చర్యలు తీసుకుంటేనే ఇతర చానెళ్లకు గుణపాఠం అవుతుందని అన్నాడు.

You may also like