“కార్తికేయ-2” సినిమాలో చూపించినట్టు… నిజంగానే పాములని కంట్రోల్ చేయగలమా..?

“కార్తికేయ-2” సినిమాలో చూపించినట్టు… నిజంగానే పాములని కంట్రోల్ చేయగలమా..?

by Anudeep

Ads

ఇటీవల విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సినిమా కార్తికేయ-2. ఈ సినిమా గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్. కార్తికేయ-2 సినిమా చూసిన అందరికీ హీరో స్టార్టింగ్ లో పాములు పట్టుకోవడానికి వాడిన చిన్న టెక్నిక్ గుర్తుంటుంది. అతను మొదట అతని పల్స్ కంట్రోల్ లోకి తెచ్చుకొని తర్వాత నేలపై చేయి ఉంచి మెల్లిగా పాముని అప్రోచ్ అవుతాడు తర్వాత ఒక్క చిటిక వేస్తాడు వెంటనే పాము వచ్చి అతని చేతికి చుట్టుకుంటుంది.

Video Advertisement

అది చూసి ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు అతను ఇచ్చిన జవాబు ఒక్కటే జూలింగ్వలిజం…అంటే సింపుల్ గా నేను నీకు హాని చేయను అని అవతల జీవికి తెలియజేయడం. ఇదేదో కొత్త కాన్సెప్ట్ లేకపోతే కేవలం సినిమా కోసం క్రియేట్ చేసిన ఒక టెక్నిక్ అనుకుంటున్నారు కానీ కాదండి ఇది మనం నిత్యం మన జీవితంలో మనకు తెలియకుండానే చేసే ఒక పని.

karthikeya 2 movie review

మనం చాలామంది ఇంట్లో కుక్కలు పిల్లలను పక్షులను పెంచుకుంటూ ఉంటాము. అవి మనతో ఎన్నో భావోద్వేగాలను పంచుకుంటాయి కూడా. ఇది ఎలా సాధ్యమని ఎప్పుడైనా ఆలోచించారా? జూలింగ్వలిజంలో మాస్టర్స్ అయితే వారు ప్రజలతో మాట్లాడినట్లు వారితో మాట్లాడతారు. వారు ఎదుట వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు మరియు దానికి అనుగుణంగా వారు స్పందిస్తారు.అయితే జంతువుల్లో తెలివితేటలని పట్టి మనుషులతో అవి కమ్యూనికేట్ అయ్యే పరిధి నిర్ణయించబడి ఉంటుంది.

karthikeya 2 movie review

కార్తికేయ 2 సినిమాలో మనకు చూపించింది కూడా అదే…. హీరో నిస్వార్థంతో వాటికి ఎటువంటి హాని చేయకుండా తన పని తాను చేసుకోవాలనుకున్నాడు.. ఆ విషయాన్ని ఆ మూగజీవులకు అర్థమయ్యేలా మానసికంగా వాటితో కమ్యూనికేట్ అయ్యాడు. మానవుడు అత్యంత పెద్ద జంతువు, మన అందరి మూలాలు ఎక్కడ ఒక దగ్గర కలిసి ఉంటాయి కాబట్టి మిగిలిన జంతువులను మచ్చిక చేసుకోవడం అంత పెద్ద సమస్య కాదు అనేది కొందరి వాదన. ఏదేమైనప్పటికీ కార్తికేయ 2 ఎండింగ్ లో హీరో కంకణం తీసుకురావడం కోసం వేల పాముల మధ్య ధైర్యంగా నడిచి వెళ్లే సీన్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలబడింది.


End of Article

You may also like