Ads
గత సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించగా పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరిద్దరికీ ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అని ప్రేక్షకులు అభినందించారు.
Video Advertisement
ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కూడా మంచి మార్కులు కొట్టేశారు. ప్రేక్షకులు అందరూ కూడా మొదటి సినిమాకు ఇలాంటి పాత్ర ఎంచుకోవడం చాలా అభినందించాల్సిన విషయం అని అన్నారు. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండ పొలం సినిమా కూడా ఇలాగే ఒక ప్రయోగాత్మక సినిమాగా నిలిచింది. ఆ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శిష్యుడు అయిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తే ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రేమ కథ కూడా ఉంది అని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అంతకుముందు తెలుగులో విడుదలైన రెండు సినిమాలు గుర్తొస్తున్నాయి.
అందులో ఒకటి ఆకాష్, రేఖ హీరోహీరోయిన్లుగా నటించిన ఆనందం సినిమా అయితే మరొకటి తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వు లేక నేను లేను సినిమా. అలాగే హీరో హీరోయిన్లు చిన్నప్పట్నుంచి ఒకరికి ఒకరు తెలిసి ఉండడం, వారిద్దరికీ గొడవలు అవ్వడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం వారి తల్లిదండ్రులు కూడా ఒకరికి ఒకరు తెలిసి ఉండడం, ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఈ రెండు సినిమాలు గుర్తొస్తున్నాయి. దాంతో రంగ రంగ వైభవంగా సినిమా ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా రీమేక్ అయితే కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article