ఆ డైరెక్టర్ తో “ప్రియాంక మోహన్” కి గొడవలు ఉన్నాయా..??

ఆ డైరెక్టర్ తో “ప్రియాంక మోహన్” కి గొడవలు ఉన్నాయా..??

by Anudeep

Ads

‘గ్యాంగ్​లీడర్’​ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది.

Video Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఓ అదిరిపోయే కథతో రజినీతో సినిమా చేస్తున్నారు నెల్సన్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన సూపర్ స్టార్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

is priyanka having clashes with director
ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ పెట్టడంతో ఈ మూవీ ఖాదీల నేపథ్యంలో ఉంటుందని అర్ధమవుతోంది. ఈ సినిమాలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఒక పాత్రకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంచుకున్నారు.
ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అయితే ప్రియాంక అరుళ్ మోహన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దర్శకుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఈ సినిమానుంచి తప్పుకుందని కోలీవుడ్ టాక్.

is priyanka having clashes with director
గతంలో నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ అనే సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ తో గొడవ కారణంగా ఆమె సూపర్ స్టార్ సినిమానుంచి తప్పుకుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
రజినీకాంత్ సినిమా ఛాన్స్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.. అలాంటిది ప్రియాంకకు తక్కువ టైంలోనే ఈ ఆఫర్ రావడం అంటే అదృష్టమనే చెప్పాలి.

is priyanka having clashes with director
‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ప్రియాంక అరుల్‌ మోహన్‌, శర్వానంద్‌తో ‘శ్రీకారం’ చిత్రంలో నటించింది. ఇటీవల తమిళంలో సూర్యతో ‘ఈటీ’ సినిమా చేసింది. రజనీతో సినిమా తన కెరీర్‌కు మరింత ఉత్సాహాన్నిస్తుందని ఈ నాయిక ఆశించింది. ప్రియాంక మోహన్ ప్రస్తుతం రాజేష్, జయంరవి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్​గా చేస్తున్నది.

is priyanka having clashes with director
నెల్సన్ ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తమిళ నాట మంచి టాక్ తెచుకున్నప్పటికీ మనదగ్గర మాత్రం పర్లేదు అనిపించుకుంది.


End of Article

You may also like