Ads
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. వివిధ దేశాల్లో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఈ చిత్ర సీక్వెల్ పై రాజమౌళి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
Video Advertisement
అయితే తాజాగా రాజమౌళి ఈ సీక్వెల్ పై స్పందించాడు. ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ గురించి మొదట్లో ఆలోచించలేదు.. కానీ ఇప్పుడు ప్రస్తుతం సీక్వెల్ మీద ఒక ఆలోచన వచ్చిందని రాజమౌళి తెలిపాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ఆలోచన రైటింగ్ స్టేజి లోనే ఉందని ఆయన వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కోసం తన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ సీక్వెల్ గురించి తమ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
సీక్వెల్ గురించి రాజమౌళి అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం రాజమౌళి వెల్లడించలేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయినపుడు ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని అంతా భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు అదే విషయాన్ని రాజమౌళి కంఫర్మ్ చేసారు.
మరోవైపు ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇండివిడ్యుయల్ గా ఆస్కార్ అవార్డు కోసం అప్లై చేసి కాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇటీవలే జపాన్ విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షనలతో దూసుకుపోతోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలు కానుంది. దాని తర్వాతే ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉండే అవకాశం ఉంది.
End of Article