టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికి పరిచయం అయ్యారు. ఆ తరువాత కుమారి 21 F , ఉయ్యాలా జంపాల, లక్ష్మి రావే మా ఇంటికి, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన స్లాంగ్ తో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు మంచి బ్రేక్ రాలేదు.

raj tarun

అయితే.. రాజ్ తరుణ్ గురించి ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది. ఈ ఏడాది చివరికి రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుక్కుని ఇంటివాడైన రాజ్ తరుణ్ త్వరలోనే ఓ ఇల్లాలిని కూడా తెచ్చుకోబోతున్నాడన్నమాట. ఈ విషయం గురించి రాజ్ తరుణ్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ.. రాజ్ తరుణ్ సన్నిహితులు మాత్రం రాజ్ తరుణ్ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని చెబుతున్నారు.