Ads
ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్ లో రాధేశ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు మొదలైన వాటిని చూస్తే చిత్రంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అలానే చాలా ట్విస్టులు వుంటాయని కూడా అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే ఇటలీలో మిస్ అయిన రైలుకి, ఈ సినిమా కధకి ఏమైనా సంబంధం ఉందా..? ఈ విషయంపై ఫ్యాన్ ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
ఇక పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే ఎక్కువగా మనకి రైలు కనబడుతోంది. టీజర్ విడుదలయిన తర్వాత సోషల్ మీడియాలో జానేటి ట్రైన్ మిస్టరీ ఫేమస్ అయ్యింది. సమస్య ఏమిటంటే ఇది ఒక హాక్స్ థియరీ. ఈ రైలు 104 మంది పాసింజర్లని తీసుకు వెళుతుంటే.. 1911 సమయంలో మాయమైపోయి గతంలోకి వెళ్లిపోయిందట.
ఫ్యాన్ థియరీ చూస్తుంటే హాస్పిటల్ సెట్ 5 కోట్లు అందులో ఉండే ఎక్విప్మెంట్ ని డొనేట్ చేసినట్టు కూడా వార్త వచ్చింది. 104 మంది ఇటలీ పేషంట్లు 1840లో తిరిగి మళ్లీ కనిపించారు. 1907 తో ఉన్న మెడికల్ రికార్డ్స్ మిస్టరీకి మేజర్ ఎవిడెన్స్ అయ్యాయి. అయితే వినడానికి చాలా ఫేక్ గా ఉన్నా ఈ హాక్స్ థియరీ ఆధారంగా తీసుకొని ఇక్కడ రాసారేమో అని తెలుస్తోంది.
Watch Video:
End of Article