NTR-30 లో వాడబోతున్న… “ఊతపదం” ఇదేనా..??

NTR-30 లో వాడబోతున్న… “ఊతపదం” ఇదేనా..??

by Anudeep

Ads

ఒక్క మాటే చాలు.. అంటున్నారు అందరూ. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తుంది ట్విట్టర్ లో. అందరూ ఈ వన్ వర్డ్ ఫీవర్స్ లో మునిగి తేలుతుంటే.. తమ అభిమానులను అలరించడానికి చిత్ర బృందాలు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి.
ఫస్టులు, మోషన్ పోస్టర్, ట్రైలెర్, టీజర్ అంటూ అభిమానుల నోట్లో నానుతుంటారు.

Video Advertisement

దక్షిణాదిలో పెద్ద చిత్రాలైన ‘పుష్ప’,’కేజిఎఫ్’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘సలార్’ చిత్ర బృందాలు ఈ వన్ వర్డ్ ట్రెండ్లో చేరాయి. తమ సినిమాల్లోని హీరోల పాత్రలను ఒక్క పదంతో నిర్వచిస్తూ పోస్ట్లు పెట్టారు.

is this is the one word for NTR 31
నరాచి సామ్రాజ్యాన్ని హస్త గతం చేసుకున్న తమ హీరో రాఖీభాయ్ ను “మాన్స్టర్ “గా పేర్కొంటూ కెజిఎఫ్ చిత్రబృందం శనివారం ఉదయం ట్వీట్ చేసింది. కాసేపటికే సాలార్ ట్విట్టర్ పేజీ నుంచి “వైలెంట్ ” అని పోస్ట్ చేశారు. వీటి గురించి చర్చించుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ని నిర్మిస్తున్న ‘యువసుధ ఆర్ట్స్’ నుంచి “వస్తున్నా ” అని ట్వీట్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో ఆయన ఊతపదం “వస్తున్నా” అనేనా అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

jr ntr is not the first choice for ntr 30 koratala siva movie
బింబిసారను నిర్మించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి “జగత్ జజ్జరిక”, “భయం” అని ట్వీట్లు వచ్చాయి. ‘పుష్ప ది రైస్’ ఖత నుంచి “ఫైర్” అని, ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి “రామ్”, “భీం” అని పోస్ట్లు రావడంతో నెటిజెన్ల వీటి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలీ ట్రెండ్ ఎలా మొదలయ్యింది అంటే ఎవరైనా యూజర్లు ఏదైనా ఒక పదాన్ని యూస్ చేసి ఏమైనా చెప్పాలనుకుంటే ఇలా చేస్తున్నారు. అమెరికా లోని అమ్ట్రాక్ అనే రైల్వే సేవల సంస్థ “ట్రైన్స్” అని తమ ట్విట్టర్ లో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా “యూనివర్స్” అని ట్వీట్ చేయగా, వాషింగ్టన్ పోస్ట్ “న్యూస్” అని పెట్టింది.

is this is the one word for NTR 31

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఇందులో చేరిపోయారు. ఆయన “క్రికెట్” అని పోస్ట్ చేశారు. క్రమంగా ప్రముఖ సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఈ ట్రెండ్లో చేరిపోతున్నారు.


End of Article

You may also like