మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Video Advertisement

ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ కుర్ర హీరోయిన్‌కు అవకాశం వచ్చినట్లు టాక్. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎప్పుడు ఇద్దరు హీరోయిన్ లు ఉండేలా చూసుకుంటారు. అలాగే ఈ చిత్రానికి కూడా మరో హీరోయిన్ ను ఎంపిక చేసారంట త్రివిక్రమ్.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింసలో గీతిక తివారి అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఈ భామకు మహేష్ సినిమాలో అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ భామకు ఇప్పటికే మరొక రెండు సినిమాల్లో ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE
మొదట ఈ పాత్రలో శ్రీలీలను అనుకున్నారు. తర్వాత అనన్య పాండే, సంయుక్త మీనన్, ఫరియా అబ్దుల్లా, ప్రియాంక అరుళ్ మోహన్, నాభ నటేష్, నిధి అగర్వాల్ పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరికి కొత్త హీరోయిన్ అయిన గీతిక తివారి కి ఈ అవకాశం దక్కినట్టు సమాచారం.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE
యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా దాదాపుగా ఐదు భాషల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళ అదే నిజం అయితే మొదటి మహేష్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది.