బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాకపోవడానికి కారణం ఇదేనా.?

బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాకపోవడానికి కారణం ఇదేనా.?

by Anudeep

Ads

నట సింహం బాలయ్య బాబు ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు. ఎంతోమంది ముద్దుగుమ్మలు ఆయన పక్కన ఆడిపాడారు. కానీ బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు.

Video Advertisement

అయితే వీరిద్దరి కాంబినేషన్ మూవీ రాకపోవడానికి.. కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల కోసం దర్శకులు కాజల్ ను సంప్రదించారు. అయితే ఆ టైంలో కాజల్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఫ్యూచర్ లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో లేదో వేచి చూడాలి.

ప్రస్తుతం మాత్రం కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే కాజల్ అగర్వాల్ త్వరలో మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చందమామ తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినా ఒకప్పటిలా ఆఫర్లు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. మెగాస్టార్ హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కొన్ని సీన్లలో కాజల్ నటించినప్పటికి కొన్ని కారణాల వల్ల ఆమె సీన్లను తొలగించారు.ఈ మధ్య కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు కాజల్ అగర్వాల్ లక్కీ హీరోయిన్ కావడం గమనార్హం.

కాజల్ తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించినప్పటికీ తెలుగు సినిమాల ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. కాజల్ తెలుగులో మొదటి సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన “లక్ష్మీ కల్యాణం” అయినప్పటికీ, “చందమామ” సినిమా ద్వారా కాజల్ కి మంచి పేరొచ్చింది. ఆ తరువాత మగధీర వంటి బ్లాక్ బాస్టర్ హిట్లోతో దూసుకుపోయింది. కాజల్ రీ ఎంట్రీ తర్వాత కూడా అద్భుతమైన విజయాలు అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

 


End of Article

You may also like