సీనియర్ హీరోయిన్ మీనా గర్భవతా? వైరల్ అవుతున్న వీడియో..!

సీనియర్ హీరోయిన్ మీనా గర్భవతా? వైరల్ అవుతున్న వీడియో..!

by Anudeep

Ads

సీనియర్ హీరోయిన్ మీనా పరిచయం అవసరం లేని పేరు. మొన్న మధ్య వచ్చిన దృశ్యం సినిమాలో కూడా అద్భుతంగా నటించి అలరించారు. బాలనటిగానే కెమెరా ముందుకు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత మీనాది. ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆమె స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు.

Video Advertisement

పెళ్లి అయిన తరువాత సినిమాలకు కొంత కాలం పాటు దూరంగా ఉన్నప్పటికీ.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి దృశ్యం, పెద్దన్న వంటి సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే.

meena 1

అయితే.. మీనా గర్భవతా? అన్న సందేహం ఇటీవల నెటిజెన్లలో కలుగుతోంది. దానికి కారణం సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న వీడియోనే. ఈ వీడియోలో మీనా కొంచం గర్భవతిగా కనిపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనా ఆల్రెడీ ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకి నైనికా అని పేరు పెట్టారు.

meena

ఈ మధ్య కాలంలో మీనా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలను షూట్ చేస్తూ తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో ఆమె గర్భవతిగా కనిపించారు. దీనితో ఆమె గర్భవతా అన్న అనుమానం అందరిలోనూ తలెత్తింది. అయితే అది షూటింగ్ లో భాగమే అని మీనా క్లారిటీ ఇవ్వడంతో అందరు లైట్ తీసుకున్నారు.

https://www.instagram.com/p/Ccc7kAEOQnL/


End of Article

You may also like