Ads
రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా యానిమల్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.
Video Advertisement
హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక తండ్రి-కొడుకుల గొడవల మధ్య సాగుతుంది. సినిమా మొత్తం యాక్షన్ అంటున్నారు. ట్రైలర్ కూడా అలాగే ఉంది అంటున్నారు.
కానీ ఈ ట్రైలర్ లో ఒక విషయం గమనించారా? ఇంత యాక్షన్ ఉన్న ట్రైలర్ లో ఒక సున్నితమైన అంశాన్ని కూడా చూపించారు. అదే పేరెంటల్ నెగ్లిజెన్స్. అంటే తల్లిదండ్రులు పిల్లలకి సరైన ప్రేమని ఇవ్వకపోవడం. చిన్నపుడు చాలా మంది పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇది. ప్రేమ అంటే కేవలం పిల్లలకి అవసరం అయిన వస్తువులు ఇవ్వడం కాదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పనుల వల్ల, వారికి ఉన్న ఒత్తిడి వల్ల పిల్లలతో సమయం గడపలేకపోతారు.
వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోలేని వయసులో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఒక వేళ తల్లిదండ్రులు కోపంగా ఉంటే ఆ కోపాన్ని తమ పిల్లల మీద చూపిస్తారు. సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లలు ఇలాంటి వాటికి చాలా బాధ పడుతారు. ఇవి పెద్దయ్యాక ఈ సమస్యలు ఎదుర్కొన్న పిల్లల మీద చాలా ప్రభావం చూపుతాయి.
తమ తల్లిదండ్రులు అలా ప్రవర్తించడం చూసిన పిల్లలు, వాళ్ళు పెద్దయ్యాక, వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక వారి పిల్లలతో కూడా పొరపాటున అలాగే ప్రవర్తించి, ఇలా ప్రవర్తించడం తప్పు అని గుర్తించకుండా, “తల్లిదండ్రులు అయ్యాక వచ్చే బాధ్యతల వల్ల ఇలాంటి కోపాలు వస్తుంటాయి. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటివి చూశాం. కానీ మేము ఇలా బాధ పడలేదు” అని తమ ప్రవర్తనని సమర్ధించుకుంటారు. ఇదే విషయాన్ని సందీప్ ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. కానీ సినిమాలో ఇంకా ఎలా చూపించారో తెలియాలి అంటే రిలీజ్ అయ్యే అంత వరకు ఆగాల్సిందే.
ALSO READ : రాధ కూతురికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?
End of Article