Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీయా సరన్. శ్రీయ ఇష్టం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాకి మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్ సినిమాలకి దర్శకత్వం వహించిన విక్రమ్. కె. కుమార్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మరొక వ్యక్తి హీరో చరణ్. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్, 2012 లో గుండెపోటుతో మరణించారు.
Video Advertisement
ఇష్టం సినిమా తర్వాత వేరే ఏ సినిమాలోనూ చరణ్ కనిపించలేదు. చరణ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కి చెందిన వారు. ఇష్టం సినిమా కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయినా కూడా సినిమా బృందంకి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత చరణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గూడచారి సినిమాల్లో నటించిన సుప్రియని పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత కొంత కాలానికి వారిద్దరూ విడిపోయారు.
charan in istam movie
2012 లో మార్చిలో చరణ్ గుండెపోటుతో మరణించారు. అప్పటికి చరణ్ వయసు 36 సంవత్సరాలు. అప్పటికే చరణ్, సుప్రియ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. చరణ్ గుండెపోటుతో చనిపోయారు అని చెప్పినా కూడా చరణ్ కి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కొన్ని విషయాలని వెల్లడించారు. సమయం కథనం ప్రకారం కుటుంబ సమస్యల కారణంగా చరణ్ మనోవేదనకు గురై, మద్యానికి బానిస అయ్యారు.
చరణ్ గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో చరణ్ మద్యానికి బానిస అవడంతో లివర్ పూర్తిగా పాడైపోయింది. ఆ కారణంగా చరణ్ మృతి చెందారు అని డాక్టర్లు పేర్కొన్నారు. చరణ్ కి, అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియకి వివాహం జరిగిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. సుప్రియ కూడా ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు.
End of Article