రోడ్డుపై టిఫిన్ షాప్ పెట్టుకుని కోట్లు సంపాదించేస్తున్నారు..చివరకు ఐటి అధికారులు చూసి ఏమి చేసారంటే..?

రోడ్డుపై టిఫిన్ షాప్ పెట్టుకుని కోట్లు సంపాదించేస్తున్నారు..చివరకు ఐటి అధికారులు చూసి ఏమి చేసారంటే..?

by Anudeep

Ads

ఈ మధ్య కాలం లో చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ వచ్చే సంపాదన కంటే చిన్న చిన్న వ్యాపారాలతోనే ఎక్కువ గా సంపాదించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. చదువుకోవడానికి వీలు లేక.. ఎదో ఒక ఆసరా కోసం ఎదురుచూసే వారు ఇలా తక్కువ పెట్టుబడిలతోనే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.  వారిలోనే కోటీశ్వరులు అవుతున్న వారు కూడా ఉన్నారు.

Video Advertisement

road side mirchi 1

ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లో కాన్పూర్ నగరం లో చూస్తే ఇలాంటి వారు చాలామందే కనిపిస్తారు. ఓ బిజీ రోడ్డు పై ఉండే మిరపకాయ బజ్జి బండి ని చూస్తే.. ఎవరైనా ఎదో పొట్టకూటి కోసం పెట్టుకుని ఉంటారు అనుకుంటారు. కానీ, ఆ వ్యాపారి కోటీశ్వరుడు అంటే ఎవరైనా నమ్మగలరా? ఆ పక్కన ఉండే మరో బండి వాడిది కూడా అదే బాపతు. ఇలా చూస్తూ పొతే.. దాదాపు ఓ రెండొందల యాభై బండ్ల వరకు ఉన్నాయి.

road side mirchi

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ వారు రైడ్ చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి. కేవలం బజ్జి బండి పెట్టుకున్నా.. వారి ఇంటికి వెళ్లి చూస్తే రాజవైభోగాలే ఉంటాయట. పెద్ద పెద్ద కార్లతో పాటు.. ఆస్తులు కూడా ఉన్నాయి అని తెలుస్తోంది. దేశం లో ఇష్టానురాజ్యం గా సంపాదిస్తూ.. ఆదాయపు పన్నుని కట్టకుండా ఉండేవారు చాలా మండే ఉన్నారు. వారిపై ఐటి శాఖ కొరడా ఝళిపించాలని భావిస్తోంది. ఈ క్రమం లో రోడ్ సైడ్ వ్యాపారాలు చేస్తున్నవారిపై ఐటి శాఖ కన్నేసింది.

road side mirchi 4

వారితో విచారణ తేలాక అందరు దండిగానే సంపాదిస్తున్నట్లు గుర్తించింది. గత నాలుగేళ్ళ కాలం లో ఏకం గా 375 కోట్ల రూపాయలను సంపాదించినట్లు గుర్తించింది. అంతే కాదు వారికి కాన్పూర్ పరిసరాలైన హులాగంజ్, ఆర్య నగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్ వంటి ప్రాంతాల్లో కూడా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. పాన్ షాపు నిర్వాహకులు గతేడాదితో ఐదు కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు.

road side mirchi 2

ఇక శానిటైజర్ వర్కర్లు, పానీ పూరి, వడాపావ్ వంటి బండి పెట్టుకునే వారు కూడా గతేడాది కాలం లో బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బండి పెట్టుకునే ఓ  యజమాని తాను అద్దెకి తీసుకున్న కార్లకు నెలకు లక్షా పాతికవేల అద్దెను చెల్లిస్తున్నట్లు బయటపడింది. వీరు లక్షల్లో.. కోట్లల్లో వ్యాపారం చేసుకుంటూ కూడా ఆదాయపు పన్ను శాఖ కు ఏ విధమైన పన్నులు కట్టడం లేదని గుర్తించారు. ఐతే వీరిలో చాలా మంది కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు కొన్నారు. కొందరు ఎలాంటి పర్మిషన్లు లేని చిట్టీలు, ఫైనాన్స్ సంస్థల్లో కొంత డబ్బుని దాచారు.

road side mirchi 3

అయితే ఆస్తులు కొనుగోలు చేసే సమయం లో వీరి ఆధార్ కార్డు ను వినియోగించడం వల్లనే వీరి వివరాలు ఐటి శాఖకు తెలిసాయి. గతం లో కూడా ఇలాంటి రహస్య కోటీశ్వరులను, పన్నులు కట్టకుండా కోట్లలో వ్యాపారం చేస్తున్నవారిని ఐటి శాఖ గుర్తించింది. ప్రస్తుతం పూర్తి విచారణ జరిపి.. పన్నులు కట్టని వారి ఆస్తులను ఐటి శాఖ సీజ్ చేసింది.


End of Article

You may also like