Ads
జబర్దస్త్ షో ఎంతో మంది కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా ఇండస్ట్రీకి పరిచయం అయిన కమెడియన్స్ లో ఒకరు నూకరాజు. అయితే నూకరాజు జబర్దస్త్ కంటే ముందు పటాస్, అలాగే జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన కామెడీ కిలాడీలు ప్రోగ్రాంలో కనిపించారు. నూకరాజు విజయవాడకు చెందిన వారు. నూకరాజు తల్లి, తండ్రి వ్యవసాయం రంగంలో ఉన్నారు.
Video Advertisement
నూకరాజు తల్లిదండ్రులకి నలుగురు సంతానం. అందులో నూకరాజు చిన్నవారు. నూకరాజు కి అంతకుముందు నుండి సినిమాలంటే ఆసక్తి ఉండేది. నూకరాజు అంతకు ముందు విజయవాడ పవర్ ప్లాంట్ లో ఉద్యోగం చేసే వారు. ఉద్యోగం వదిలేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చారు. జీ తెలుగులో అంతకుముందు కామెడీ కిలాడీలు అనే ప్రోగ్రాం కి ఆడిషన్స్ నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ కి 5 ఆడిషన్స్ పెడితే ఆ 5 ఆడిషన్స్ లో కూడా నూకరాజు సెలెక్ట్ అయ్యారు.
దాంతో కామెడీ కిలాడీలు ప్రోగ్రాం ద్వారా మొదటిసారి తెరమీద కనిపించారు నూకరాజు. ఆ తర్వాత అది డైలీ షో అవ్వడంతో, ఉద్యోగం ఇంకా షో మేనేజ్ చేసుకోవడం కష్టం అయిందట. డేట్స్ ఇబ్బంది అయ్యాయట. దాంతో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ కి వచ్చేశారు. అంతకుముందు కూడా నూకరాజు కి సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ జంక్షన్ ప్రోగ్రాం లో అవకాశం వచ్చిందట.
అందరూ అవకాశం కోసం ముందు రమ్మని, తర్వాత వద్దు అనేవాళ్ళు. దాంతో నూకరాజు తనకి అదృష్టం లేదేమో అని తన ఉద్యోగంలో కంటిన్యూ అయ్యారట. తర్వాత జీ తెలుగు కామెడీ కిలాడిలులో సెలెక్ట్ అయ్యి, యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు. తనకి నచ్చిన పని చేయడంలో ఎంతో సంతోషం ఉంది అని అంటారు నూకరాజు. కామెడీ కిలాడీలు నూకరాజు తన ఉద్యోగం వదిలేసి వచ్చిన రెండో షెడ్యుల్ కి ఆపేసారట.
దాంతో ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి “కొత్త ఎపిసోడ్స్ రావట్లేదు ఏంటి?” అని అడిగేవారు. అప్పుడు నూకరాజు దర్శకుడికి ఒంట్లో బాలేదు అని అబద్ధం చెప్పారు. అప్పుడు రూమ్ అద్దె కట్టడం కష్టం కావడంతో తన స్నేహితుడిని ఏదైనా పని ఇప్పించమని సహాయం అడిగితే, ఆయన సిమెంట్ పని ఇప్పించారు. నాలుగు అంతస్తుల భవనంలో పై అంతస్తులో ఉన్న బస్తాలన్నిటిని కిందకి మోయడం నూకరాజు పని.
బస్తాలు భుజం మీద పెట్టుకొని మోయడంతో నూకరాజు భుజం వాచిందట. కానీ “నచ్చిన పని కోసం ఇన్ని ఇబ్బందులు పడటం ఏంటి. గట్టిగా ఒక రెండు మూడు నెలలు కూర్చొని చదివితే మళ్ళీ ఉద్యోగం తిరిగి వస్తుంది” అని అనుకున్నారు. తర్వాత మళ్లీ నూకరాజు స్నేహితులలో ఒకరు ఆడిషన్ ఉందని చెప్పడంతో వెళ్లి ఆడిషన్ ఇచ్చి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత పిట్ట గోడ, అబ్బాయి క్యూట్ అమ్మాయి నాటు ప్రోగ్రామ్స్ లో కనిపించారు. ఆ తర్వాత నుండి పటాస్, జబర్దస్త్ అలాగే వరుస షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు నూకరాజు.
End of Article