Home News జబర్దస్త్ లో రోజా మిస్సింగ్..? హాస్పిటల్ లో ఉన్నారా..? అసలేమైంది..?

జబర్దస్త్ లో రోజా మిస్సింగ్..? హాస్పిటల్ లో ఉన్నారా..? అసలేమైంది..?

by Anudeep

జబర్దస్త్ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది జడ్జి గా వ్యవహరించే రోజా నే. ఒకప్పటి హీరోయిన్ రోజా ప్రస్తుతం పాలిటిక్స్ లో దూసుకెళ్తూనే.. మరో వైపు బుల్లితెరపైనా రాణిస్తున్నారు. డబల్ మీనింగ్ లు ఎక్కువ గా ఉంటాయని జబర్దస్త్ కు పేరున్నా.. ఈ షో రేటింగ్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కువ మంది అభిమానుల్ని, ప్రేక్షకుల్ని జబర్దస్త్ సంపాదించుకుంది. ఈ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్న రోజా కూడా కంటెస్టెంట్ లతో పాటు జోకులేస్తూ.. వాళ్ళు వేసే జోకుల్ని సరదాగా తీసుకుంటూ.. ఈ షో ను మరింత రక్తి కట్టిస్తున్నారు.

jabardast rojaa

అయితే, లేటెస్ట్ గా రిలీజ్ ఐన ఎపిసోడ్ లో రోజా కనిపించలేదు. ఆమె స్థానం లో జడ్జి గా ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ కూడా ఆకట్టుకుంటున్నప్పటికీ.. రోజాకి ఏమైందన్న సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి.. 2019 వరకు నాగబాబు తో కలిసి జడ్జిమెంట్ ఇచ్చిన రోజా.. ఆ తరువాత నుంచి సింగర్ మను తో కలిసి స్టేజి పంచుకున్నారు. రోజా కు ఆరోగ్యం బాగుండలేదని, ఆసుపత్రి లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

rojaa

ఆమె కు రెండు మేజర్ సర్జరీ లు చేశారని రోజా భర్త సెల్వమణి వివరించారు. అయితే, అభిమానులను ఆందోళన చెందవద్దని సెల్వమణి కోరారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె ఆరోగ్యం గానే ఉన్నారని సెల్వమణి వివరించారు. అయితే, మరో రెండు వారాల పాటు ఆమె పూర్తి గా విశ్రాంతి తీసుకుంటారని వివరించారు. అభిమానులు కంగారు పడి ఆసుపత్రికి రావద్దంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. రోజా గారు తొందరగానే కోలుకుని తిరిగి బుల్లితెరపై సందడి చేయాలని కోరుకుందాం..

You may also like