వర్ష బర్త్డే స్పెషల్ గా… నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన ఇమ్మానుయేల్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

వర్ష బర్త్డే స్పెషల్ గా… నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన ఇమ్మానుయేల్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Megha Varna

Ads

వర్ష ఇమ్మానియేల్ కి మధ్యలో ఏం నడుస్తోంది అనేది అందరిలీ వుండే సందేహమే. ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుందా అని అని అందరిలో ఈ ప్రశ్న వుంది. జబర్దస్త్ వేదికపై వర్ష ఇమ్మానియేల్ ప్రేమకథ మనం చూస్తూనే ఉంటాం. సుధీర్ రష్మీ తర్వాత వర్ష ఇమ్మానియేల్ ఇంత రేంజ్ లో ప్రచారాన్ని దక్కించుకున్నారు.

Video Advertisement

ఇదిలా ఉంటే తాజాగా వర్ష కోసం ఇమ్మానియేల్ వర్ష కి ఓ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చాడట. మరి ఇక అసలు ఏం అయ్యింది..?, ఎందుకు ఇమ్మానియేల్ వర్ష కి ఈ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చాడో చూద్దాం.

వర్ష, ఇమ్మానియేల్ ఇద్దరి మధ్య కూడా లవ్ ట్రాక్ నడుస్తూ వుంది. పైగా ఈ లవ్ ట్రాక్ ఆధారంగా స్కిట్లని కూడా చేస్తూ ఉంటారు. ఇలా ప్రేక్షకుల్ని వీళ్లిద్దరూ అలరిస్తూ ఉంటారు. తాజాగా నెక్లెస్ కి సంబంధించి జరిగిన విషయాన్ని చూస్తే.. మామూలుగా మనం గిఫ్ట్స్ ని ఎవరికైనా ఇస్తూ ఉంటాము. నచ్చిన వ్యక్తి కి బహుమతిగా ఏదో ఒకటి ఇవ్వడం లేదంటే ఎవరైనా ఇస్తే తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలానే ఇమ్మానియేల్ కూడా వర్ష కి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ నగల షాప్ కి తీసుకు వెళ్లి ఖరీదైన నెక్లెస్ ని కొని ఇచ్చాడట.

వచ్చే నెల వర్ష బర్త్డే ఉండడం వలన ఇలా ఇమ్మానియేల్ వర్ష కి సర్ప్రైజ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. కానీ ఈ వీడియోలో ఉన్న ఆఖరి విషయాన్ని చూస్తే నవ్వు ఆపుకోలేరు. నిజంగా ఇమ్మానియేల్ వర్ష కోసం ప్రేమతో ఏమి కొన్ని ఇవ్వలేదు కేవలం వీడియోని చేయడానికి మాత్రమే ఈ బహుమతిని ఇచ్చాడట. వీడియో చివరన కూడా ఈ విషయం చెప్పారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.


End of Article

You may also like