జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి కారణం అదే..! కమెడియన్ సత్య సంచలన కామెంట్స్!

జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి కారణం అదే..! కమెడియన్ సత్య సంచలన కామెంట్స్!

by Anudeep

Ads

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటులెందరో.. అలాగే ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలనుకుని వచ్చి నటులైన వారు కూడా చాలామంది . అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉంటూనే నటులుగా మారిన వారున్నారు నేచురల్ స్టార్ నాని కూడా అలా మొదలైంది కి ముందు అసిస్టెంట్ డైరెక్టరే. కమెడియన్ సత్యా కూడా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే నటుడిగా మారారట.. అంతేకాదు జబర్దస్త్ ని ఎందుకు వదిలేయాల్సొచ్చింది.భవిష్యత్లో ఏం చేయాలనుకంటున్నారు అనే కొన్ని ఆసక్తికర విషయాలు..

Video Advertisement

నిఖిల్ తో నటించిన  స్వామిరారా చిత్రం సత్యకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో చిల్లర దొంగతనాలు చేసుకునే వారిగా నిఖిల్, సత్య , పూజా రామచంద్రన్ ల నటనకి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. మత్తు వదలరా సినిమా ద్వారా మళ్లీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ కామెడి పండించారు. ఇటీవల  వచ్చిన చిత్రాల్లో మత్తువదలరా లో సత్యా కామెడికి కడుపుబ్బా నవ్వుకున్నారు ప్రేక్షకులు..జక్కన కూడా సత్యా కామెడిని మెచ్చుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. తన జీవితంలో మర్చిపోలేని ప్రశంస రాజమౌలిది అని చెప్పుకొచ్చాడు సత్యా.

ఇక ప్రస్తుతం ఉన్న చాలామంది కమెడియన్స్ లానే సత్యా కూడా ఒకప్పుడ జబర్దస్త్ లో తన స్కిట్స్ తో నవ్వించినవాడే. ఆ కార్యక్రమం నుండి ఎవరు తప్పుకున్నా ఒక రకమైన క్యూరియాసిటి ఉంటుంది ప్రేక్షకులకి.. ఇటీవల చాలామంది జబర్దస్త్  కి పోటీగా పెట్టిన అదిరింది షో కోసం జబర్దస్త్ ని వదిలేసిన విషయం తెలిసిందే.అయితే సత్య జబర్దస్త్ ని వదిలేయడానికి వరుస సినిమా ఆఫర్లే కారణమట. జబర్దస్త్ ని వదిలేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే కాని లక్కీగా సినిమా అవకాశాలు వచ్చాయి అని వివరించాడు.

నిజానికి డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. ద్రోణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చారు, కాదనలేకపోయాను అలా ద్రోణ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యా. కాని తర్వాత ఆరేళ్లపాటు ఎలాంటి ఆఫర్స్ లేక ఇబ్బందులు పడ్డాను అంటూ అప్పటి పరిస్తితులను వివరిస్తూ, దర్శకుడు అవ్వాలనేది నా బలమైన కోరిక, అందుకే ఎప్పటికైనా దర్శకుడిగా మారతాను ఒక సినిమా తీస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.


End of Article

You may also like