Ads
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాసేపు జబర్దస్త్ చూస్తే చాలు నవ్వుతూనే ఉంటాం. అయితే జబర్దస్త్ లో పంచ్ ప్రసాద్ కూడా కామెడీతో అలరిస్తాడు. ఇతను టైమింగ్ తో, పంచులతో అందర్నీ నవ్వించి ఎంటర్టైన్ చేస్తాడు. అయితే స్టేజ్ మీద నవ్వించే ప్రసాద్ జీవితంలో ఎంతో బాధ ఉంది. ఎన్నో కష్టాలు పడ్డాడు ప్రసాద్. తన ఆస్తి మొత్తం వైద్యానికి ఖర్చు అయిపోవడంతో నానా యాతన పడ్డాడు.
Video Advertisement
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యని కూడా సరిగ్గా చూసుకో లేకపోతున్నానని ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తనకి అండగా నాగబాబు, జబర్దస్త్ ఫ్యామిలీ నిలబడ్డారని చెప్పుకొచ్చాడు.
ప్రసాద్ కి సునీత అనే అమ్మాయి తో ఎంగేజ్మెంట్ అయ్యింది. వీళ్లిద్దరు కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఇంతలో తన కిడ్నీలు పాడైపోయాయి అని తెలిసింది. సునీత తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేది. అయితే సమస్య చాలా సీరియస్ గా ఉందని పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాడు.
అతని కుటుంబ సభ్యులు కూడా ఆమెని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ ఆమె వినలేదు. ఎన్ని రోజులు ఉన్న పరవాలేదని ఆమె ప్రసాద్ ని వివాహం చేసుకుంది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఆమె గర్భిణీ. అయినప్పటికీ ఆసుపత్రిలో పక్కనే కుర్చీ వేసుకుని కూర్చునేది అని చెప్పాడు ప్రసాద్. అయితే తనను పెళ్లి చేసుకున్నాక కూడా అనవసరంగా పెళ్లి చేసుకున్నానని బాధపడ్డాడు.
ఇక ఒకరోజు అయితే ఆత్మహత్య చేసుకుందామని తన భార్యతో కూడా చెప్పాడు. ఆ సమయంలో నాగబాబు తనని పిలిచి నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పారు. అలానే జబర్దస్త్ టీం, రోజా గారు కూడా హెల్ప్ చేశారని చెప్పాడు. తన కొడుకు పుట్టిన తర్వాత మరింత ఆరోగ్యంగా వున్నానని.. ధైర్యం వచ్చిందని చెప్పాడు. ఎప్పుడూ హైబీపీ ఉండేదని కొడుకు పుట్టిన తర్వాత నార్మల్ అయిపోయిందని చెప్పాడు.
End of Article