Ads
జబర్దస్త్ షో ఎంతోమంది జీవితాలకి వెలుగునిచ్చింది. జబర్దస్త్ పేరు చెప్పుకొని లైఫ్ లో సెటిల్ అయిన కమెడియన్స్ చాలామంది ఉన్నారు. అందులో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిల వేషం వేసుకొని ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్లలో జబర్దస్త్ వినోదిని ఒకరు. జబర్దస్త్ వినోదిని అసలు పేరు వినోద్. జబర్దస్త్ ఆఫర్ల కోసం అమ్మాయిలా మారి కామెడీ చేస్తూ రాణిస్తున్నాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో చమ్మక్ చంద్ర వంటి వారితో కలిసి ఎన్నో స్కిట్లు చేశారు.అయితే చాలా రోజుల నుంచి జబర్దస్త్ షోలో కనిపించకపోవడం లేదు.
Video Advertisement
అదే సమయంలో వినోద్ తాను అనారోగ్యం పాలైనట్లు అందుకే షో కి దూరమైనట్లు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే ఇప్పుడు వినోద్ ని చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత పీలగా మారిపోయాడు వినోద్. అతను చాలా సంవత్సరాల నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విషయం తెలిసిందే, దానికోసం అతను రెండు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు.
అయితే ఆ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం మూలంగా పూర్తిగా బరువు తగ్గిపోయానని, ఒక నెలలోనే చాలా వెయిట్ లాస్ అవ్వడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకుంటే వ్యాధి నిర్ధారణ అయిందని చెప్పాడు వినోద్. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ తినటం వల్ల కూడా వెయిట్ లాస్ జరిగిందన్నాడు. గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వినోద్ ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడినట్లు, మళ్లీ వెయిట్ గైన్ అవుతున్నట్లు చెప్పాడు. అదే సమయం లో ఒక ఒకరిని నమ్మి…షూరిటీ ఇచ్చి ఐదు లక్షలు మోసపోయారంట.
ఇలాంటి సమయంలో తనకి తన ఫ్యామిలీ, జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు నటి రోజా కూడా తన గురించి స్పెషల్ కేర్ తీసుకునే వారని, ఆర్థికంగా కూడా చాలా సాయం చేశారని చెప్పుకొచ్చాడు వినోద్. ఆరోగ్యం కుదుటపడిన వినోద్ ఇప్పుడిప్పుడే షోస్ కి రావడం స్టార్ట్ చేశాడు.
Also watch:
End of Article